బిజెపికి గుణపాఠం చెప్పిన కర్ణాటక! గాలి లాంటి వాళ్ళు ఎవరికైనా భారమే!

ప్రకృతి సంపద అవిచ్చిన్నంగా దోపిడీ చేసి రాజకీయ పునాదులు, ఆపై ఆర్ధిక పునాదులు అంతెత్తున నిర్మించుకున్న గాలి జనార్ధనరెడ్డి ప్రభంజనం మాత్రమే కాదు ఆయన కున్న పేరు ప్రతిష్ఠలు పూర్తిగా అదృశ్యం అయ్యాయి. గత చిరకాలంగా ఆయన కంచుకోట‌గా ఉన్న కర్ణాటక బ‌ళ్లారి లోక్‌స‌భ స్థానం సుమారు ప‌దిహేనేళ్ల త‌ర్వాత కాంగ్రెస్ గెలుచుకుంది. కర్ణాటక ఉపఎన్నికలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఉపఎన్నిక‌లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పరుగు ముందు కమలం వాడిపోయింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కి విజయం లభించింది. 


కర్ణాటక ఉపఎన్నికల ఫలితాల్లో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. మూడు లోకసభ, రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను ఈ కూటమి గెలుచుకుంది. బళ్లారి లోకసభ బీజేపీ సిట్టింగ్ స్థానం. దీనిని బీజేపీ కోల్పోయింది. ఇది బీజేపీకి పెద్ద షాక్. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోకసభ ఎన్నికల్లో, జామ్‌కండి, రామనగర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. గత శనివారంనాడు ఉపఎన్నికలు జరగగా నేడు (మంగళవారం) ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.


ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో మాత్రం చావు బ్రతుకుల మద్య స్వల్ప మెజారిటీతో అక్క‌డ మాత్రం బీజేపీకి ఉప‌శ‌మ‌నం కలిగింది. జమఖండి అసెంబ్లీ సీటు, బళ్లారి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. మెజారిటీ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉండ‌టం తో ఇక బీజేపీ పరువు ప్రతిష్ఠల సమస్య ఏర్పడింది. మరో వైపు మాండ్య లోక్‌సభ స్థానం మ‌ళ్లీ జేడీఎస్ ద‌క్కించుకుంది. రామనగరం అసెంబ్లీ స్థానంలో ముఖ్యమంత్రి కుమారస్వమి భార్య అనిత కుమారస్వామి భారీ ఆధిక్యంతో గెలిచింది. అనితా కుమారస్వామి లక్షకు పైగా ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతుండ‌టం విశేషం.

Bang before the big bang: How assembly polls will set the tone for 'battle 2019'

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు కాంగ్రెస్‌కు కొత్త ఊపును తెచ్చిపెట్టాయి. ప‌లురాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగ బోతున్న నేప‌థ్యంలో ఇది మూడ్ ఆఫ్ ది నేషన్ ను బయట పెడుతుంది అని కాంగ్రెస్ సంబ‌రాలు చేసుకుంటోంది. బీజేపీ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు ప్రస్తుతం సహించ‌డం లేద‌ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసే బీజేపీ ప్ర‌య‌త్నాల‌కు ఇది హెచ్చ‌రిక అని ముఖ్యమంత్రి కుమార‌స్వామి వ్యాఖ్యానించారు.


శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర గెలిచారు - బళ్లారి లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప గెలిచారు - జామ్‌కండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్దూ న్యామగౌడ విజయం సాధించారు - రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు - మాండ్య లోకసభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ విజయం సాధించారు - శివమొగ్గలో బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర విజయం సాధించారు.


ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్‌లు కలిసి పోటీచేశాయి. బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది - మాండ్య, రామనగరలో జేడీఎస్‌ అభ్యర్థులు శివరామె గౌడ, అనిత కుమార స్వామి బరిలోకి దిగారు. బళ్లారి, జామ్‌ఖండీ లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఉగ్రప్ప, ఆనంద్‌ న్యామగౌడ్‌ పోటీలో ఉన్నారు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ శ్రీరాములు సోదరి శాంత బరిలో నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: