టిడిపి ప్రొప్రయిటర్స్ కు పవన్ కళ్యాణ్ ఝలక్ స్వంత మీడియాతో నిక్కినీల్గుతున్న "రాష్ట్రవార్త"

దేశం విషయం ప్రక్కన పెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లొ సామాజిక సమాచార వ్యవస్థ ప్రజలకు నిజమైన సమాచారం ఇవ్వటంలో పూర్తిగా వైఫల్యం చెందాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తమ స్వంత మీడియా ద్వారా - ఏ వార్తలు రాస్తే తమ పార్టీకి రాజకీయ, ఆర్ధిక, సామాజిక వర్గ ప్రయోజనాలు కలుగుతాయో ఆ వార్తలే రాస్తున్నాయి. వాటినే బానర్ ఐటంలు గా, హెడ్లైన్సులో ప్రచురిస్తున్నాయి.


చదివే పత్రికను బట్టి ఆవ్యక్తి ఏపార్తీకి చెందిన వారో ఈ ఉభయ రాష్ట్రాల ప్రజలు నిర్ద్వంధంగా చెప్పగలిగే పరిస్థితులు ఇక్కడ నెలకొనటం అత్యంత విచారకరమైన విషయం. "పచ్చ మీడియా" గా పిలవబడే  పత్రికలదే  ఈ వ్యవస్థలో ప్రస్తుత ఆదిపత్యం. ముఖ్యమంత్రి ఆయన కుల బందు మిత్ర పార్టీ వర్గాలు ఏ చిన్న విషయమైనా ఈ మీడియా బాగా ఎలవేట్ చేసి చూపుతారు. ఎలక్ట్రానిక్ మీడియా ఐతే రోజంతా ఊదరగొడతాయి.  అసలు ఎంతటి ధారుణమైన వార్తలనైనా వక్రీకరించి తమ అనుకూల పార్టీలను సమర్ధిస్తూ ఆకాశానికెత్తి రాయటం వీటి ప్రత్యేకత.


దానితోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, దాని మద్దతు మీడియా పై రెచ్చిపోయి తగ్గకుండానే మాట్లాడారు. ఏపి సిఎం "నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీలో కింగ్, పాలనలో స్ట్రాంగు" అని చెపుతూ టీడీపీ అభిమానుల పరువు నిట్టనిలువునా తీశాడు. "తిత్లీ తుపాను విషయంలో జనసేన అధినేత ఏ మాత్రం స్పందించ లేదని - కనీసం ప్రధానికి లేఖ కూడా రాయలేదని" చంద్రబాబు, జగన్మోహనరెడ్డి తో పాటు నిన్న నారా లోకేష్ నాయుడు కూడా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చారు. అయితే పవన్ అంతకు మించి వీళ్ళందరికి కాస్త కటువుగా ఘట్టిగానే ఝలక్ ఇచ్చారు.


చంద్రబాబు గారు అబద్ధాలు మాట్లాడతారు అని చెప్పడానికి సాక్ష్యమే నిన్నటి ఆరోపణ అన్నట్లుంది పవన్ స్పందన. ఉత్తరాంధ్రకు తుపాను సాయం కోరుతూ నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ రాసిన లేఖను బయట పెట్టారు పవన్ కళ్యాణ్. అయితే మీడియా విషయంలో అంత వేగంగా ఉండే చంద్రబాబుకు, ఒక పార్టీ అధినేత ప్రధానికి రాసిన లేఖ విషయంలో సమాచారం లేకపోవటం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.


ముఖ్యంగా టిడిపి అధినేతకు రాజకీయంగా పంచప్రాణాలు మీడియానే, సమాచారమే. అంటే, పవన్ కళ్యాణ్ ప్రధానికి లేఖ రాయలేదని గాని, రాశారని గాని ఆయనకు స్పస్టంగా తెలియదు. ఏదో ఆరోపణ చేయాలి కాబట్టి చేయాలన్నట్లు ఉంది చంద్రబాబు తీరు. దీన్ని బట్టి చంద్రబాబు ఎంత అవలీలగా అబద్ధాలు ఆడుతారో? పవన్ కళ్యాణ్ ద్వారా నిరూపితం అయ్యింది.


దీనికి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరిన్నికామెంట్లు చేశారు. ప్రధాన ఎలక్ట్రానిక్ మీడియా అంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏ వార్తలు రావాలి? ఏ వార్తలు రాకూడదు? అనేది మీరే వారే లేదా మీ మద్దతు మీడియానే నిర్ణయించటం జరుగుతుంది. అందుకే చంద్రబాబు పరివారం వార్తలు ప్రచురించి వారికే ప్రచారం కలిపించటంతో మా పార్టీ (జనసేన) వార్తలకు కనీస ప్రాముఖ్యత ఆ మీడియా యివ్వటం లేదనేది, మా పార్టీ ఏం చేస్తుందో జనాలకు తెలియకుండా చేస్తున్నారు అంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేశారు.


మరో ట్వీట్ లో నిన్న లోకేష్ అడిగిన దానికి కౌంటర్ ఇచ్చారు. అవినీతికి ఆధారాలు కావాలా? ఇది చాలదా? అంటూ మీ మద్దతు పచ్చ పత్రిక ఈనాడులో వచ్చిన మట్టైనా మనదేనోయ్ అనే పత్రిక వార్త క్లిప్పింగును దానికి జత చేశారు పవన్. మొత్తానికి తండ్రీ కొడుకులను పవన్ కళ్యాణ్ ట్వీట్లతో ఫుట్-బాల్ ఆడుకున్నారు. ఇప్పటికైనా ఈ పచ్చ మీడియా అన్నీ వార్తలు అందరికి ఎంతోకొంత అవగాహనలోకి వచ్చేలా వార్తలు రాస్తే మంచిది. లేకుంటే 2019లో టిడిపి కాకుండా వేరే పార్టీ అధికారం లోకి వస్తే జరగబోయే పరిణామాలు చెప్పుకోవటానికి వార్తలు రాసినా ప్రజల్లో సానుభూతి కూడా దొరకదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: