పవన్ కు తాను గెలుస్తానని నమ్మకం కూడా లేదా ... అందుకే ఆ స్థానాలు...!

Prathap Kaluva

పవన్ నోరు తెరిస్తే ఒకటే మాట చెబుతుంటాడు నాకు కుల పిచ్చి లేదని మరీ పవన్ ను నమ్ముదాము అయితే పవన్ కు కుల పిచ్చి లేకపోతే కాపులు ఎక్కువ గా ఉన్న ఉత్తరాంధ్ర నుంచి ఎందుకు పాదయాత్ర మొదలు పెట్టనట్లు ... అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజక వర్గం లో ఇంత వరకు క్లారిటీ లేదు.  ముందుగా అనంతపురం.. అక్కడ నుంచి పవన్ పోటీ చేస్తాడని ప్రకటించి చాలాకాలం అయ్యింది. అయితే ఆ తర్వాత దాని గురించి అప్ డేట్ లేదనుకోండి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ పోటీ.. అనే విషయంలో చాలా నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. పవన్ కల్యాణే తనకు ఆయాచోట్ల నుంచి పోటీ చేయాలని ఉందని ప్రకటించుకున్నాడు.


ఇక మరికొన్ని స్థానాల విషయంలో జనసేన వర్గాలు ఆ మేరకు ప్రచారం చేశాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేస్తాడని.. వాళ్లు ప్రచారం చేసిపెట్టారు. ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పిఠాపురం నియోజకవర్గం విషయంలో. ఇక్కడ నుంచి పవన్ పోటీ చేస్తాడట. ఇదీ కథ. అనంతపురం నుంచి పాడేరు వరకూ.. పవన్ కల్యాణ్ పోటీ గురించి అనేక నియోజకవర్గాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. పాడేరు రిజర్వడ్ నియోజకవర్గం అయినా.. అక్కడ నుంచి పోటీకి పవన్ కల్యాణ్ మక్కువ చూపుతున్నాడట! ఈసీని ఒప్పిస్తారేమో చూడాలి!


ఇది పవన్ కల్యాణ్ లో ఉన్న గందరోగళానికి నిదర్శనమో లేక జనసేనలో ఉన్న గందరగోళానికి రుజువు అనుకోవాలో కానీ.. పవన్ కల్యాణ్ పోటీచేయగా పోనూ మిగిలిన నియోజకవర్గాలు ఏవైనా ఉంటే.. వాటికి అభ్యర్థులు ఖరారు చేయడమే మిగిలిందిక! ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే.. పవన్ కల్యాణ్ పోటీ విషయంలో వినిపిస్తున్న నియోజకవర్గాల ప్రత్యేకత.. ఆయా చోట్లల్లా కాపుల జనాభా ఎక్కువగా ఉంది అనే విశ్లేషణ. కాపు లేదా బలిజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల పేర్లే పవన్ పోటీ విషయంలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: