మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!

Prathap Kaluva

మహాకూటమిలో చంద్రబాబు కీలకపాత్ర పోషిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి సీట్ల కేటాయింపుల్లో తనదైన ముద్ర వేస్తున్నారంటూ బాబు అనుకూల మీడియా ఊదరగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ కథనాల్ని జానారెడ్డి ఖండించారు. నాన్సెన్స్.. చంద్రబాబుకు అంత సీన్ లేదంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు జానారెడ్డి.నాన్సెన్స్.. మా పార్టీలో చంద్రబాబు కీలకపాత్ర పోషించడం ఏంటి. చంద్రబాబే మా పార్టీతో కలిసి వస్తున్నారు.


కేసీఆర్ తో అవసరం ఉంది కాబట్టి ఒక టైమ్ లో కలిశారు. బీజేపీతో అవసరం ఉండి ఈమధ్య కలిశారు. ఇప్పుడు మాతో అవసరం ఉంది కాబట్టి కలిశారు. అంతేతప్ప మహాకూటమిని చంద్రబాబు శాసించడం ఏంటి నాన్సెన్స్. మేం పోయి కలవడం ఏంటి. ఆయనే స్వయంగా మంతనాలు చేసి, మాతో వచ్చి కలిశాడు. మేం ఒప్పుకున్నాం." ఇలా చంద్రబాబు అసలు రూపాన్ని బయటపెట్టారు జానారెడ్డి. ఎల్.రమణ వంటి తెలంగాణ టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబును కలుస్తున్నారనే కథనాలపై ఫక్కున నవ్వారు జానారెడ్డి.


ఒకప్పుడు చంద్రబాబే తన ఇంటి ముందు నిలబడ్డారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంటి ముందు టిక్కెట్టు ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదు. అది అబద్ధం. నిజంగా చంద్రబాబుకు అంత ఉంటే నేను కూడా వెళ్లి కలుస్తా. నా ఇంటి ముందు కూడా చాలామంది నిలబడ్డారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా నా ఇంటికి వచ్చారు. దాన్ని ఎలా చూడాలి మరి. అంతా చంద్రబాబు చేతిలో ఉందనడం పచ్చి అబద్ధం." చంద్ర బాబు ను కూరలో కరివేపాకు తీసినట్టు జానారెడ్డి మాట్లాడినాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: