శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!

KSK
ఒకానొక సమయంలో వరుస ఫ్లాపుల మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇచ్చి..జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది.


ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా హిట్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ట్రాక్ లో పడటంతో ప్రస్తుతం 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా కూడా సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నాడు జూనియర్.


ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కి భారీ హిట్ ఇచ్చిన ‘టెంపర్’ సినిమాను కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ విశాల్ రీమేక్ చేస్తున్నాడు. తమిళ సినిమా రంగంలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్ ఈ సినిమాను మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.


ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవల విశాఖపట్టణం లో కొంత షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సినిమాల్లో అత్యంత కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు..సినిమా యూనిట్. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, విశాల్ సరసన రాశి ఖన్నా కనిపించనుంది. పార్తీబన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.     



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: