జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!

KSK
తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత మొదలుపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర లో జగన్ తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారు. దాదాపు 17 రోజుల విరామం తర్వాత జగన్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావడంతో ముఖ్యంగా హత్యాయత్నం జరిగిన తర్వాత ఎక్కడా కూడా బెదరకుండా వెన్ను చూపకుండా జగన్ గతంలో ఏ విధంగా ప్రజాక్షేత్రంలో వ్యవహరించారో అదేవిధంగా వ్యవహరించడంతో ప్రజలు జగన్ కి బ్రహ్మరథం పడుతున్నారు.


ఈ నేపథ్యంలో జగన్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీస్ సెక్యురిటీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రీన్, బ్లూ, రెడ్ విభాగాలుగా సెక్యూరిటీని విభజించారు. జగన్‌ను కలుసుకోవాలనుకునే వారి కోసం రెడ్ కార్డులను ఇష్యూ చేశారు. అలాగే జగన్‌ను అనుసరించే ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర సిబ్బందికి బ్లూ కార్డులు, బందోబస్తులో ఉన్న పోలీసులకు గ్రీన్ కార్డులను ఇచ్చారు.


కాగా కేసు విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు వస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన తరువాత జగన్ వ్యక్తిగతంగా తన భద్రత సిబ్బందిని పెంచుకుని..తనపై హత్యాయత్నం కి ప్రయత్నించిన రాజకీయ దుష్టశక్తులకు భవిష్యత్తులో దీటైన సమాధానం చెప్పే రీతిలో ప్రత్యర్థులకు దడ పుట్టించేలా అడుగులు ముందుకు వేస్తూ పాదయాత్రలో సాగుతున్నారు.


ఇదే క్రమంలో ప్రస్తుతం విజయనగరంలో జగన్ చేపడుతున్న పాదయాత్రకు ఆ ప్రాంతంలో ఉన్న వైసిపి కార్యకర్తలు మరియు నాయకులు కూడా జగన్ భద్రత విషయమై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: