జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వింటుంటే ఎవరికైనా హాస్యాస్పదంగా అనిపించక మానవు. ఒక పక్కేమో తనను సీఎం ను చేయమని ప్రజలను అడుగుతాడు. అదే జగన్ సీఎం అనుకోవాలనుకుంటే మాత్రం తప్పు. ఎవరు ఔనన్నా, రాజకీయం అంటేనే డబ్బుతో పని. మరి, రాజకీయాల్లోకి వచ్చాక.. డబ్బు కోసం కాక, పదవికోసం కాక.. జనాన్ని ఉద్ధరించేస్తామంటే నమ్మే స్థితిలో ఎవరూలేరు.. ఓటర్లు సైతం ఈ విషయంలో ఖచ్చితమైన అభిప్రాయంతో వున్నారు.


కాంగ్రెస్‌లో వుండగానే, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవికి సంబంధించి 'బంపర్‌ ఆఫర్‌' వచ్చిన మాట వాస్తవం. వైఎస్‌ మరణానంతరం, 150 మంది ఎమ్మెల్యేలు, జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలంటూ నినదించారు.. సంతకాలు చేశారు. అప్పటి మంత్రి కొండా సురేఖ, తన మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎందుకు.? జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలనే డిమాండ్‌తోనే కదా.! అయినా, అప్పట్లో జగన్‌ ముఖ్యమంత్రి పదవిని కాదనుకున్నారు.


పదే పదే, ఒకటికి వందసార్లు.. 'ముఖ్యమంత్రి పదవి తప్ప, జగన్‌కి ఇంకో ఆలోచన లేదు..' అంటూ పవన్‌కళ్యాణ్‌, పొలిటికల్‌ డైలాగులు పేల్చుతూ, వైఎస్సార్సీపీ అధినేత మీద విరుచుకుపడ్తున్నారు. జగన్‌, గతంలో ఎంపీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఆశిస్తే తప్పేంటట.? పవన్‌ వెటకారం చేశాడని జగన్‌కి ముఖ్యమంత్రి పదవి రాకుండా పోతుందా.? అది ప్రజలు నిర్ణయించాల్సిన విషయం. ఏడాదిగా వైఎస్‌ జగన్‌ జనంలోనే వుంటున్నారు.. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా పాదయాత్ర ద్వారా ప్రజలతోనే మమేకమవుతున్నారు. మరి, పవన్‌కళ్యాణ్‌ ఏం చేస్తున్నట్లు.? ఇంకా పార్టీ నిర్మాణమే జరగలేదాయె. జనసేన పోరాటయాత్ర పేరుతో.. అప్పుడప్పుడూ 'విహార యాత్రలు' చేస్తున్నారాయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: