చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?

నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారు అనేది చరిత్రకు తెలుసు. ఇప్పుడు వర్తమానానికి కూడా అర్ధమౌతుంది. అయితే ఆయన చరిత్రగతిని పరిశీలిస్తే ఆయనకున్న అధికారదాహం ఏపాటిదో అందరికీ అర్ధమౌతుంది. అక్కడ తన బంధుత్వం, బంధం అన్నీ మరచి స్వంతమామకే అదీ పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పోడిచిన చరిత్ర చంద్రబాబుది. 

అదే నేడు — నాడు నారా చంద్రబాబు నాయుణ్ణి టిడిపి నుండి  వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు బహిష్కరించినట్లు ప్రకటించిన లేఖ అంతర్జాలం లో విస్తృతంగా వైరల్ అయింది. దాన్ని ఈ సమయంలో చంద్రబాబు నైజం - నాడు ఆయన్ని అనుసరించి రాజకీయ బిక్ష పెట్టిన - ఎన్టీఅర్ ని ముంచేసిన నాయకగణం గుఱించి తెలుసుకోవటం అవసరం.

సమయం వచ్చినప్పుడు పాత విషయాలను తిరగదోడుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం కావచ్చు. తెలంగాణలో ఎన్నికల వేడిలో పలువురు నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1995 ఆగస్టు సంక్షోభం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, మంత్రి చంద్రబాబు నాయుడును టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తూ జారీ చేసిన లేఖ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై తెగ చర్చలు జరుగుతున్నాయి. అసలు అది ఎన్టీఆరే రాశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


వివరాల్లోకి వెళితే 1995 నాటి ఎన్టీఆర్ హయాంలో జరిగిన ఒక సంఘటనను ఇక్కడ ప్రస్తావించాల్సిందే. అప్పట్లో చంద్రబాబునాయుడుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం, అదే పార్టీ నుండి బహిష్కరణ నిర్ణయం. ఆనిర్ణయం తాలూకు లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  24 యేళ్ల తరవాత ఎవరో చంద్రబాబు నేత్రుత్వంలోని ఆయన బృందం నైజాన్ని లోకానికి వెళ్ళడించటానికి మరోసారి అంతర్జాలంలో వదిలేశారు అది ఇప్పుడు దావానలంలాగా వ్యాపిస్తుంది. 

టిడిపి నుంచి చంద్రబాబు సస్పెండ్ అవ్వటం ఏంటి షాక్ అవుతున్నారా? తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు సస్పెండ్ ఎలా అవుతారు? పార్టీ నుంచి ఆయనని బహిష్కరించే అధికారం ఇంకెవరికి ఉంది? 


1995 నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ కీలక పరిణామం ఇప్పట్లో చాలా మందికి తెలియదనే చెప్పాలి. అందుకే కాబోలు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎన్టీఆర్ చంద్రబాబుని సస్పెండ్ చేస్తూ వెలువడిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఇదిలాఉంటే అసలు ఏం జరిగింది? ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబుని సస్పెండ్ చేశారు? ఆ తర్వాత పరిణామాలు ఇలాంటి పరిస్థితులకు దారితీశాయో? తెలియాలంటే, చరిత్ర పుటల్లోకి వెళ్ళాల్సిందే.

అది ఆగస్టు నెల 1995 ఆ సమయంలో ఎన్టీ రామారావు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. సరిగ్గా  అప్పుడే చంద్రబాబు నాయుడు పార్టీ పై పూర్తి పట్టుసాధించే క్రమంలో లక్ష్మీపార్వతిపై ఆరోపణలు చేస్తూ నాటి ప్రధాన ఈనాడు గౄపు సహాయ సహకారాలతో, మీడియాని మేనేజ్ చేస్తూ, ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పిలిపించుకుని వైస్రాయ్ హోటల్ వేదికగా (నేటి మారియట్ హోటల్ ) కాంప్ రాజకీయాలు నడిపి ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్నారు.

లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ భార్యగా టిడిపిపై పట్టుసాధిస్తుండడాన్ని నారా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోయారు. కడుపుమంటతో నమ్మకద్రోహులైన ఎమ్మెల్యేలతో కలిసి వైస్రాయ్ హోటల్ వేదికగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. అందరినీ తనవైపు తిప్పుకుని పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే అప్పట్లో చంద్రబాబుకి ఎమ్మెల్యేలు మద్దతు లేకపోయినా, మీడియా సహాయంతో చంద్రబాబుకు అనుకూలంగా 120 నుంచి 140 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారని ప్రచారం చేయించు కున్నారు. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఎమ్మెల్యేలు భవిష్యత్తు మీద భయంతో చంద్రబాబు వెంట పడ్డారు. 
"ఈనాడు" అధినేత రామోజీరావు-నాటి నుండి చంద్రబాబుకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఈ మీడియానే ఈ నారాసురుణ్ని బ్రతికిస్తుందని చెప్పవచ్చని అంటున్నారు విశ్లేషకులు నాటి చరిత్ర కళ్ళారా చూసిన ప్రజలు.

విషయం తెలిసిన ఎన్టీఆర్ వెంటనే హైదరాబాద్ చేరుకుని వైస్రాయ్ హోటల్‌కు ఎమ్మెల్యేలను తిరిగి రావాల్సిందిగా కోరారు. కానీ ఎవరూ రాలేదు. దాంతో క్రమంగా చంద్రబాబు బలం పెరగడంతో పార్టీపై మెల్లగా పట్టుసాధించారు. అయితే ఎన్టీఆర్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల ను చూసి తన అనుచరగణంతో వైస్రాయ్ హోటల్ వద్దకు ర్యాలీగా బయలుదేరారు. అద్భుతంగా ఒక వెలుగు వెలుగుతున్న సినీ జీవితాన్ని వదిలేసి ఎంతో కష్టపడి నిర్మించు కున్న తెలుగుదేశం పార్టీ, తనని మోసం చేయవద్దని హోటల్ బయట నుంచి మైకుల ద్వారా ఎమ్మెల్యేలను వేడుకున్నారు. ఆ తరువాత అక్కడ అనూహ్యంగా ఎన్టీఆర్ పై రాళ్లు చెప్పులతో దాడి జరగడంతో ఎంతో అవమానంగా వెనుదిరిగారు ఎన్టీఆర్.


చంద్రబాబు తనకున్న బలంతో ఎమ్మెల్యేలను తన గుప్పిటలో పెట్టుకున్నారు. అనూహ్య పరిణామాల మధ్య కాచిగూడ లోని బసంత్ టాకీస్‌ లో మినీ మహానాడు నిర్వహించి, టిడిపి కీలక నేతలు అందరూ తన వెనకాలే ఉండటంతో అధ్యక్షుడిగా ఎన్టీఆర్ ని తప్పించి తనను టీడీపీ అధ్యక్షుడిగా  నియమించేలా చేసుకున్నారు.  అనంతరం సెప్టెంబరు 1న చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.   ఈ ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు తన మద్దతు ఎమ్మెల్యేలతో గవర్నర్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 

ఆ తర్వాత సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  నారా చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలకు ఎంతో మనోవేదన పడిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబుతో సహా అశోక్ గజపతిరాజు, విద్యాధరరావు, దేవేంద్రగౌడ్, మాధవరెడ్డిలను తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరిస్తూ రాసిన లేఖను నాటి సభాపతి యనమల రామకృష్ణుడుకు పంపించారు.

అయితే అప్పటికే టిడిపిని హస్తగతం చేసుకున్న తరుణంలో ఎన్టీఆర్ ఉత్తర్వులకు బలంలేకుండా పోయింది అవమానభారంతోనే ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించడం జరిగిందనేది చరిత్ర  చెబుతోంది. ఈ వార్త తెలియని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా గత విషయాల గురించి అప్పటి ఎన్టీఆర్ చంద్రబాబు మధ్య జరిగిన పోరు గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారని ఎన్నికలు ముంచు కొస్తున్న సమయంలో ఈ తరహా దాడులు సహజమేనని కొట్టి పారేస్తున్నారు కొందరు టీడీపీ నేతలు.

అది ఙ్జప్తికి వచ్చిన నాటి ఙ్జాపకాలతో నారాసురుని లీలలు తెలిసిన పెద్దలు ఎన్నికల్లో సరైన గుణపాఠం తెలుగుదేశంవాళ్లకు నేర్పే అవకాశం దొరుకుతుంది. చరిత్ర తెలియని యువత నారాసుర రాజకీయ సంహారానికి నడుం బిగిస్తారనే ఈ లేఖ వైరల్ చేసి ఉండవచ్చు. కాని ఒకసారి పాపాత్ముని గుణగణాలను ప్రజలకు తెలిస్తే చాలు - విఙ్జులైన ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: