అనపర్తిలో చంద్రబాబు మరియు జగన్ లపై దారుణంగా విమర్శలు చేసిన పవన్..!

KSK
టిడిపి అధినేత చంద్రబాబు మరియు వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ అనపర్తిలో జరిగిన మహాసభలో సీఎం చంద్రబాబు మరియు ప్రతిపక్ష నేత జగన్ పై దారుణమైన విమర్శల వర్షం కురిపించారు.


ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో  చేతులు కలపడాని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. తాను తన అన్నయ్య చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతు పలికానని అయితే చంద్రబాబు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీకి తాకట్టుపెట్టారని ఆరోపించారు. అనుభవజ్ఞుడని ప్రజలు అధికారం ఇస్తే ఇలా చేస్తారా అంటూ నిలదీశారు.


ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని తీవ్ర అవినీతి మయం చేసిందని రానున్న ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు పేర్కొన్నారు. ఈక్రమంలో అధికారపార్టీ టిడిపిని నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్ అధికారం కోసం పాదయాత్రలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.


జగన్ ని ప్రశ్నిస్తే తన ఇంటి ఆడపడుచులను తిడతారని వాళ్ల ఇంటి ఆడపడుచులను తాము తిట్టలేమా అని ప్రశ్నించారు. జగన్ కు మందీమార్బలం ఉండొచ్చు కానీ తాను భయపడాల్సిన అవసరం లేదన్నారు. మొత్తంమీద పవన్ కళ్యాణ్ రోజురోజుకి తన ప్రజాపోరాట యాత్రలో చంద్రబాబు మరియు జగన్ లపై తీవ్రస్థాయిలో మాటల యుద్ధం పెంచుకుంటూ పోతున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: