ఆంధ్రప్రదేశ్ లో సిబీఐ మాజీ జెడి వివి లక్ష్మినారాయణ కొత్త రాజకీయపార్టీ?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నీతివంతమైన వాళ్ళకి కావలసినంత రాజకీయ శూన్యత ఉంది. దాన్ని నిజాయితీగా వినియోగించుకుంటూ ముందుకువచ్చే వారికి జనం సైతం నీరాజనాలు పడతారు. బహుశ దాదాపు ఒక సంవత్సర కాలం గ్రామీణ జన బాహుళ్యంలో మమేకమై వారి అవసరాలను, అందులో సామాజిక రాజకీయ అవకాశాలను పరిశీలించిన లక్ష్మినారాయణ ఎట్టకేలకు నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 


దరిమిలా ఆయన ఆశయాల సాధనలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి, రాజకీయ సామాజిక ఆర్ధిక రాజకీయ వృక్షం వెళ్లూననుంది. అంటే ఆశయ సాధన ప్రజాసేవ పరమార్ధం గా   మరో కొత్త పార్టీ రాబోతోంది. సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు  రాజకీయాలు, ప్రజాసేవపై అమితమైన ఆకాంక్షతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.


ఈ క్రమంలో ఆయన జనసేన, టీడీపీ, బీజేపీలలో ఏదో ఒకపార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి సేవ చేస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి.. గ్రామీణులు, ప్రధానంగా రైతుల సమస్యలపై గ్రామస్తులతో మమేకమయ్యారు. కళాశాలల్లో పర్యటించి విద్యార్థులతో ముఖాముఖిలు నిర్వహించారు. తిత్లీతుఫాను బాధితప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని, నష్టనివారణ చర్యలు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన అంశాలపై ఇతోదికంగా సమాచార సేకరణతో పాటు తీసుకోవలసిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి సమగ్ర నివేదిక కూడా అందించారు. 


ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం భారీగాజరిగింది. వీటన్నింటికి తెరదించుతూ,  ఆయన తానే సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు గా తెలుస్తోంది. వ్యవవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే ప్రధాన అజెండా గా ఆయన పార్టీ ఉండనుంది.


ఈ నెల 26న పార్టీ పేరును ప్రకటించి.. లక్ష్యాలు, అజెండాను లక్ష్మీనారాయణ ప్రజలకు వివరిస్తారని సమాచారం. కడప జిల్లాకు చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీశైలంలో జరిగింది. వరంగల్ "నిట్‌" నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా, చెన్నై "ఐఐటీ" నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పోలీస్ శాఖకు ఎంపికయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: