అహా! సోనియామ్మ నీ ప్రేమ ఎంత మధురం! తెలంగాణాపై పెంచుకున్న మోజెంత అనంతం!!

తెలంగాణా జననం నిజంగా ఈ భూమాతకు ప్రసవవేదనే. పసిబిడ్డ పుట్టింది. సకల సంపదలతో విలసిల్లే ఈ బిడ్డను కైవసం చేసుకోని, అధికారంలోకి రావటానికి ప్రతి ఒక్కరు పడనిపాట్లు లేవు. అధికారంలోకి రాలేక ప్రభుత్వం ఏర్పడ్దాక కూడా ప్రజాప్రతినిధులను కొనేసి తిరిగి అధికారం చేజిక్కిచ్చు కోవాలనే ఔరంగజేబ్ తరహా కిరాతకాలూ చేశారు. దాని కోసం ఏకంగా "ఓటుకు నోటు" అనబడే ఒక ఖండకావ్యాన్ని తెలంగాణా పసిప్రాయపు  చెక్కిలిపై లిఖించారు, దృశ్య రూపకంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకే కాదు దేశ వ్యాప్త జనావళికి ప్రజాస్వామ్యాన్ని ఎన్నిరకాలుగా ఎంతగా ఎంతలా ఖూనీ చెయ్యోచ్చో చేసి చూపించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 

"జామాత దశమగ్రహ" 

టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావును వెన్నుపోటుపొడిచి అధికారంలోకి వచ్చిన  బాబు తెలంగాణా కోసం చేయని అకృత్యమూ, కుశ్చితమూ, కుతంత్రమూ లేదు. దాని సాధన కోసం చివరకు తన ఆజన్మశత్రువు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం, చిన్నాచితకా పార్టీలన్నీ కలసి  ప్రజాకూటమి గా రూపాంతరం చెంది  తిరిగి తెలంగాణా ప్రజలను వంచించటానికి మోసం చేయటానికి సమాయత్తమవటం తెలుగుజాతి ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎన్నటికి అంగీకరించవు.

అంతేకాదు రాష్ట్రవిభజన హృదయవిదారకంగా చేసిన కాంగ్రెస్ పై సైతం "సెటిలర్స్" అనే ముద్ర వేసి మనసుల్లో కోతలు పెట్టేలా రాజకీయాలు చేయటం ఇప్పటికీ క్షమించరానిదే. ఇక్కడున్నవారంతా తెలంగాణావాసులే.  అటు సీమాంద్రులకు, కలసి ఉండటంలోని అనుబంధం, ఆత్మీయత కోరుకునే తెలంగాణావారికి అందరికి ఈ విభజన ఆమోదయోగ్యమా? కాదా? అన్న విషయం తెలుసు కోకుండా నిట్టనిలువునా రాష్ట్రాన్ని కోసేసిన కాంగ్రేస్ అధినేత్రి సోనియా, రాహుల్ వాళ్ళు మొసలికన్నీరు కారుస్తూ మాట్లాడిన మాటలు ఒకసారి "ఈనాడు" కళ్ళతో చూద్ధాం.
"పుట్టిన బిడ్డలకు సరిగా పోషణ అందకున్నా, పెంపకంలో లోపం ఉన్నా, మున్ముందు వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో! ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ తెలుసు. పిల్లలు సక్రమంగా పెరిగితేనే తల్లులకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తే నాకు అలాంటి బాధే కలుగుతోంది. కడుపు తరుక్కుపోతోంది. రాష్ట్రం పుట్టిన తరువాత మీ బాగోగుల్ని తన చేతుల్లోకి తీసుకున్న కేసీఆర్‌, మిమ్మల్ని పట్టించుకోకుండా, తన సొంత బాగోగులు మాత్రం చూసుకున్నారు...." సోనియా తీయని మాటలు ఉద్వేగ భరిత నటన హిమోన్నతం.

రానున్న రోజుల్లో ప్రజాకూటమి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం, ఇవాళ ఉన్నట్లుగా ఒక కుటుంబం కోసమో, ఒక వ్యక్తి కోసమో కాకుండా, నాలుగు కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలను సఫలం చేయడానికి పనిచేస్తుంది. కూటమి ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ విద్యార్థులు, మహిళలు, రైతుల ఆశలు, ఆకాంక్షలూ కనిపిస్తున్నాయి....రాహుల్ గాంధి ఆశల హరివిల్లు నింగీ నేలను కలిపేస్తుంది.

ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు చాలాసంతోషంగా ఉంది. ఒక తల్లి చాలారోజుల తరువాత తన బిడ్డలను చూసినంత ఆనందం, భావోద్వేగం కలుగు తున్నాయి.  తెలంగాణను కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అప్పట్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో గుర్తొస్తోంది. తెలంగాణ ఏర్పాటు అంత సులువైన విషయం కాదని తెలుసు. అది చాలా సంక్లిష్టమైన సమస్య. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల అస్తిత్వసమస్యలు మా ముందు ఉండేవి. 

కానీ తెలంగాణ ప్రజల ఆలోచనలు, వారి బలమైన ఆకాంక్షను అర్థం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ, అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, రాహుల్‌ గాంధీతో కలిసి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటు కారణంగా రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాకు తెలుసు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆహా! ఆ త్యాగం అధ్బుతం, ఆ ప్రేమ మధురం, ఆ ఆప్యాయత అనంతం, ఆ అనుబంధం అమరం. 

తెలుగుదేశంతో కలవకపోతే ఈ కలయికను దుష్టచతుష్టయం అనవలసి వచ్చేది కాదు (కాంగ్రెస్-టిడిపి-టిజేయస్-సిపీఐ)    


వీళ్ళ కథలు ఇలా ఉంటే ఒక్కసారిగా నాలుక మడతేసిన చంద్రబాబు దుస్తంత్రమూ తెలియని తెలుగువారుండరు. ఇక నారా చంద్రబాబు నాయుడు నుండి అనేక ప్రయోజ నాలు, ప్రజల సొమ్ము స్వాహా చేశారని, కులం ప్రధానంగా వ్యవహరించే పచ్చ మీడియా, తెలుగు సమాజానికి చెసే హాని, మాటల్లో చెప్ప సాధ్యం కానిది. కోట్ల గొంతు కల మౌన హృదయాలతో ఈ చంద్రబాబుకు మాత్రమే మద్దతిచ్చేమీడియా కు బుద్ధిచెప్పాలని నిరీక్షిస్తున్న జనావళి ఆగ్రహం ఇప్పుడు తారస్థాయికి చేరింది. 

పచ్చ మీడియా నాలుకే కాదు పేజీలను కూడా మడతేసి, మొత్తం తమ అస్థిత్వం విశ్వసనీయతను కూడా కోల్పోతూ  చూపించే  కాంగ్రెస్ చరిత్ర కూడా చంద్రబాబు కోసమే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: