వైఎస్ జగన్ జట్టులోకి ఉండవల్లి - చంద్రబాబు గుండెల్లో చలిమంటలు

ఉండవల్లి అరుణ కుమార్ అనగానే గుర్తుకు వచ్చేవి మంచి భాషా చాతుర్యం, దానికి తగిన వాగ్ధాటి, దుమ్మురేపే చమక్కుల వాక్ప్రవాహం అంతకు మించి ఉన్న విషయాన్ని చెక్కు చెదరకుండా, ఉన్న నిజాన్ని మాయం చేయకుండా, చక్కని వాక్-మషాలాలతో పోపుపెట్టి ఘుమఘుమలతో వాయించేసి ఎడుటివాడు ఎంతటి ధీరుడైనా డమ్మీ చేసేయగల నేర్పరి. ఎదుటి వాడు చివరికి చంద్రబాబైనా! సరే.


ఉండవల్లి వైఎస్ సమూహానికి ముఖచిత్రం ఒకనాడు. జగన్ అహంభావానికి దూరంగాఉండిపోయి ఇప్పుడు బహుశ జగన్ లో రాజకీయ పరిణితి వయసుతో పాటు బాగా రాజకీయాల్లో నలగటం వలన అదీ 'ఎన్ సి బి ఎన్ ' తో పోరాటం వలన కూడా వచ్చి ఉండవచ్చు. చతురంగ బలాలన్నీ ఒక ఎత్తు. తన తండ్రి స్నేహితుణ్ణి అదే ఉండవల్లిని తన హితుడుగా చేసుకుంటే ఈయన ఒక ఎత్తు.


తొలినాటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయిన తర్వాత 2014ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చిత్తుగా ఓడిపోయింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని ఇక్కడ చెప్పుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కు కనీస భరోసా ఉంది.



కాని నిట్ట నిలువునా ఉన్నపళంగా చీల్చి తలలేని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రజలలోకి వెళ్లడానికి ఎటువంటి నైతికత అవకాశం రెండూ మిగల్చలేదు సోనియా.  దీంతో హేమా హేమీలైన కాంగ్రెస్ నాయకులు కూడా మట్టి గొట్టుకు పోయి జనబాహుళ్యానికి దూరంగా బతుకుతున్నారు. అలాంటి వారిలో సత్తా సామర్ధ్యం రాజకీయాలపై సరైన పట్టున్న వ్యక్తొకరు ఉండవల్లి అరుణ కుమార్.



వైఎస్ రాజశేఖర రెడ్డి సాహచర్యంలో సన్నిహితంగా ఉంటూ రాజకీయ పాఠాలు నేర్చుకుని తనకున్న సహజ విషయ పరిఙ్జానం, సేకరణ, పరిశీలన పరిశోధన లాంటి ప్రత్యేక సుగుణాలతో అద్భుతంగా ఎదిగి తన స్థానాన్ని రాజెకీయంగా సుస్థిర పరుచుకున్నారు.

అయితే ఈ రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యుణ్ణి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి తన పార్టీలో చేరాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. పైన చెప్పినట్లు రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు - రాజకీయాలలో అనుభవఙ్జుడు సీనియర్ అయిన ఉండవల్లి లాంటి వాళ్లు తమ పార్టీలో ఉంటే - తన పార్టీకి చక్కని మైలేజ్ ఉంటుందని జగన్మోహనరెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. గతంలో మీడియా మొఘల్ అని చెప్పబడ్ద ఈనాడు రామోజీరావును కూడా ఏడుచెరువుల నీళ్ళు తాగించిన ఘనతర చరిత్ర ఆయనది. పోలవరం నిర్మాణం లో జరిగిన అవకతవకలను అపోసన పట్టిన ఘనుడాయన.    


అయితే ఉండవల్లి అరుణ కుమార్ ఈ ఆహ్వానాన్ని ఆమోదించారా? లేదా? అన్నది తెలియవలసి ఉంది. అయితే వైసిపిలో తనకు ఉండబోయే స్దానంపై సరైన స్పష్టత  వచ్చాకనే ఉండవల్లి అరుణ కుమార్ తన నిర్ణయం చెప్పే అవకాశాలు న్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


2014ఎన్నికల తర్వాత ఉండవల్లి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ - రాజకీయ మౌలిక విషయాలకు మాత్రం దూరంగా ఉండలేదు ఉండవల్లి. తన నైతిక సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వకుండా-సరైన తరుణం వచ్చినప్పుడల్లా వదల కుండా తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తనదైన శైలిలో "చమక్కులు, చురకలు, అగ్నికణాలు" మాటల మహత్మయంతో విసురుతూనే ఉన్నారు.


ఉండవల్లి అరుణ కుమార్ వైసిపిలో చేరితే ఇది చంద్రబాబుకు జరిగే నష్టం అనంతమని, లెక్కలకు అందదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 2019ఎన్నికలలో ఇప్పుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కున్న ప్రజా బలానికి తన వాక్చాతుర్యం తోడైతే ప్రజలను ఇట్టే ఆకట్టుకోవటం అనితర సాధ్యమైన విజయం వారి స్వంతమౌతుందని-అంతే కాకుండా దిన దినం తరిగి పోతున్న చంద్రబాబు ప్రజాకర్షణకు ధీటుగా సమాధానం చెప్పగలరని రాజనీతిఙ్జులు భావిస్తున్నారు.


అధికారపార్టీని ఎండ గట్టడంలో ఉండవల్లికి సాటివచ్చే నాయకులే ప్రస్తుతం లేరు అని విశ్లేషకులు అంటున్నారు. ఉండవల్లి అరుణ కుమార్ వైసిపిలో చేరితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం రసవత్తర ప్రవాహంగా మారుతుందని అమరావతి లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో చంద్రబాబు ఖేల్-ఖతం అవవచ్చు. నిరీక్షిద్ధాం!

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: