టీడీపీ నేతలు మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారే .... కారణం అదేనా...!

Prathap Kaluva

టీడీపీ నేతల మాటలు వారు చెప్పే నీతులు కేవలం పక్క వారికి వర్తిస్తాయి. వారికి మాత్రం కాదు సుమా...  సుజనా చౌదరి ఆర్థిక అవకతవకల్లో చిక్కుకుపోవడంపై తెలుగుదేశం పార్టీ .. రాజకీయాలు, పతనం అవుతున్న విలువల గురించి మాట్లాడుతోంది. మోడీకి బొత్తిగా విలువలు లేకుండా పోయాయని.. అందుకే ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం చెబుతోంది. వినేవాళ్లు ఉంటే టీడీపీ ఇలానే చెబుతూ ఉంటుంది. చివరిసారి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడు టీడీపీ ఇలానే నీతులు చెప్పింది. అప్పట్లో కేసీఆర్ మీద టీడీపీ కస్సుమంది.


కేసీఆర్ కు రకరకాల సవాళ్లు చేసింది. ఓవరాల్ గా తెలంగాణలో టీడీపీని తాకట్టుపెట్టి అప్పట్లో తప్పుకుంది. ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం పార్టీ విలువల గురించి ప్రవచనాలు మొదలుపెట్టింది. మోడీ ఎన్నెన్ని అక్రమాలు చేశాడో చెబుతోంది. మొన్నటివరకూ మోడీ దగ్గరే ఉండింది టీడీపీ. మోడీ మళ్లీ ప్రధాని కావాలని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడే తీర్మానం ప్రవేశపెట్టాడు ఎన్డీయే మీటింగులో. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. అందుకే మోడీని టీడీపీ నిందిస్తూ ఉంది. ఇక తెలుగుదేశం నేతల దూకుడు మాత్రం చాలా తగ్గిపోయింది.


సుజనా చౌదరి వ్యవహారంలో స్పందించడానికి టీడీపీ నేతలు మొహంచాటేస్తూ ఉన్నారు. ఇదేతరహా స్కామ్ మరోటి వెలుగులోకి వచ్చి ఉన్నా, మరొకరు ఎవరైనా ఇలా ఇరుక్కుని ఉన్నా.. అప్పుడు టీడీపీ నేతలు వరస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్లు. అది పక్కదేశంలో ఎవరైనా ఆర్థిక నేరంలో చిక్కుకున్నా.. టీడీపీ నేతల స్పందన ఖాయంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇరుక్కున్నది తమవాడు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తేలుకుట్టిన దొంగల్లా కామ్ గా ఉన్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: