గజ్వేల్ అభ్యర్ధి మిస్సింగ్ - ఇది టిఆర్ఎస్ పనేనా? విచారణకు హైకోర్ట్ ద్విసభ్య ధర్మాసనం

తెలంగాణ ముందస్తు ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే అసలైన వ్యవహారాలన్నీ ముగిసిపోవడంతో, ఇక మిగిలిన ఘట్టం కోసం అన్ని పార్టీలు సిద్ధమవు తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచి, అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అంతే ధీటుగా మిగిలిన పార్టీలు కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో వింతలు చోటుచేసుకుంటున్నాయి. 

ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ తెలంగాణాలో ఎన్నికల నేరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కేసీఅర్ పోటీ చేసే నియోజకవర్గం గజ్వేల్ లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్దు ల పిర్యాదులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రముఖంగా వినిపించేదేమంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్‌వాది ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బరి లోకి దిగిన కె.దినేష్ చక్రవర్తి మాయమైపోయినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్ మురళీధరరావు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 19న నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఆయన కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు స్పందించింది. 

అయితే, సీఎం కేసీఆర్ పోటీలో ఉన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ నెలకొంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గట్టి పోటీనిస్తున్నారు. అయితే కేసీఆర్ కు పోటీగా గజ్వేల్ బరిలో నిలిచిన ఓ పార్టీ అభ్యర్థి గల్లంతు కావడం కలకలం రేపుతోంది. ఆయన్ను వెతికి పట్టుకోవాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు పోలీసులను తాజాగా ఆదేశించడం సంచలనం రేపుతోంది. 

ఈ వ్యాజ్యాన్ని పరిశీలించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి లతో కూడిన ద్విసభ్య ధర్మాాసనం దినేష్ చక్రవర్తిని మంగళవారం కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కొద్ది రోజులు దినేష్ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దినేష్ ఎప్పటినుంచైతే కనిపించకుండా పోయారో అప్పటి నుంచి 'ఎన్నికల కమీషన్ వెబ్‌-సైట్‌‌' లో కూడా ఆయన పేరు కనిపించక పోవటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోందని ఆ పార్టీ తరఫు న్యాయవాది తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ స్థానంలో, ఆయనపై పోటీకి దిగిన అభ్యర్థులను బెదిరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా గజ్వేల్‌ నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రజా కూటమి అభ్యర్ధి వంటేరు ప్రతాపరెడ్డి కూడా, పోలీసులు తనను వేదిస్తున్నారంటూ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 


గజ్వేల్‌ లో ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్ రావు కాాంగ్రెస్ కార్యకర్తలను భయపెడుతున్నారని వంటేరు ప్రతాపరెడ్డి ఎప్పటి నుండో ఆరోపిస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో డబ్బులున్నాయని చెబుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. దినెషును ఎవరో అపహరించుకు పోయారని, టిఆరెస్ నేరపూరితంగా అయన్ను తమ వద్ధ బంధీగా ఉంచుకున్నారని ఇక్కడ ప్రచారంలో ఉంది. పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికి తలవంచి పనిచేస్తున్నారని అభిఙ్జవర్గాల కథనం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: