చంద్రబాబుకు మాజీ జెడి, లక్ష్మినారాయణ బలమైన స్ట్రొక్ ఇవ్వటానికే సిద్ధంగా ఉన్నారా?

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ముంగిట్లోకి వస్తుంది. ఏపీ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతూ రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. శత్రువులు మిత్రులు అవుతున్నారు. మిత్రులు శత్రువులు అవుతున్నారు. తాజాగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఇక్కడి రాజకీయాలను మరింత వేడెక్కించాయి. జగన్‌మోహనరెడ్డిపై కత్తి దాడి ఘటనపై తొలిసారి స్పందించిన లక్ష్మీనారాయణ, చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షానికి అనుకూలంగా అధికారపక్షానికి  వ్యతిరేకంగా ఆయన మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

 ప్రతిపక్షనేత జగన్‌మోహన రెడ్డిపై దాడి చంద్రబాబు నాయుడి సార్ఫ్ధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యమేనని, రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానికి అధికారంలో ఉన్న ప్రభుత్వమే బాధ్యత వహించాలని లక్ష్మీనారాయణ చెప్పారు. అంతేకాదు ప్రభుత్వ అసమర్ధత వల్లనో నిర్లక్ష్యం వలననో పుష్కరాలు సమయంలో 30 మంది జనప్రాన హననం, నవ నిర్మాణ ధర్మ దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయటం వంటివి అత్యంత ప్రమాదకర నేరాలని భావిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను మేల్కొలుపుతున్నాయి. ప్రజాధన దుర్వినియోగం ఎలా జరిగినా అది మంచిది కాదన్నారాయన. కొత్త పార్టీ ప్రకటనపై హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడుతూ సీబీఐ మాజీ జేడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

 అయితే ఈ వ్యాఖ్యలు ప్రతిపక్షనేత జగన్మోహన రెడ్డికి మద్దతిఉగాను, అధికార టిడిపిని దాని అధినేత నారా చంద్రబాబు నాయుణ్ణి టార్గెట్ చేస్తూ అన్నట్లున్నాయని పలువురు భావిస్తున్నారు. మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఇప్పుడు హాట్-టాపిక్‌గా మారాయి. ఎందుకంటే నాడు సీబీఐ జేడీగా జగన్మోహనరెడ్డి రాబడిని మించిన ఆస్తుల కేసు లను విచారించింది లక్ష్మీనారాయణే. ఆ కేసు కారణం గానే ఆయన ఒక్కసారిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి రావడం, జనానికి బాగా తెలిసి వారు ఆయనకు ఆకర్షితులవ్వటం పేరు ప్రతిష్ఠలు పెరగటం జరిగింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌మోహన రెడ్దికి  అనుకూలంగా వ్యఖ్యలు చేయడం గురించి అంద్రు చర్చించుకుంటున్నారు.

 

బహుశ ఈ మాజీ జెడి చెప్పిన విషయాలు "రాబడిని మించిన ఆస్తులు" కు చెందని విషయాలు కాబట్టి పెద్దగా ఆయన మాటల్లో రంధ్రన్వేషన చేయటం అనవసరమని ఆయన్నెరిగిన వారంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: