పవన్ కళ్యాణ్ కి గట్టి కౌంటర్ లు వేసిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్..!

KSK
వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఫుల్ డోస్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోడి కత్తి గురించి జగన్ పై చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్లు వేశారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఒక చిన్న పిల్ల వాడికి కోడి కత్తి ఇచ్చి నీ మీద దాడి చేయించుకోండి మీరు బ్రతికి.. నువ్వంటే జగన్ గారు మీరు అనుకున్నట్లే డ్రామా ఆడారని అనుకోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరారు అనిల్ కుమార్ యాదవ్.


నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా ఎవరిపైన పడితే వారి పైన విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని..రాష్ట్రాన్ని మోసం చేసిన వారిపై విమర్శలు చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కి హితవుపలికారు అనిల్ కుమార్ యాదవ్. కోడి కత్తి కోడి కత్తి అంటూ జగన్ పై నువ్వు చేస్తున్న వ్యాఖ్యలకు..వెటకారాలకు సమాధానం చెప్పుకునే రోజులు కూడా ఉంటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అనిల్.


ముఖ్యంగా వివిధ సభలలో నాకు ధైర్యం ఉంది నాకు ధైర్యం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ వేశారు. ధైర్యం అనేది ప్రతి రోజూ వచ్చి చూపించేది కాదు, సమయాన్ని బట్టి అదే బయటకి వస్తుంది.


ప్రతి మీటింగ్ లో నేను ధైర్య వంతుడిని నేను ధైర్య వంతుడిని అని చెప్పుకునేది ఒళ్లంతా భయం ఉన్న వాడే. తన మీద దాడి జరిగినా చొక్కా మార్చుకుని హుందాగా బయటకి వచ్చిన వ్యక్తి వైయస్ జగన్ అని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్. అంతేకాకుండా చంద్రబాబు మీరు ఒకటే అని ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు తెలియజేశారని పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు అనిల్ కుమార్ యాదవ్.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: