సుజానా చౌదరిపై ఈడి విచారణకు అడ్డుచెప్పేది లేదన్న డిల్లీ హైకోర్ట్

నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాగే బాంకులను దోచేసిన ఘనుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు, దేశంలోనే అత్యంత నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ అనుభవం గలిగిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన యలమంచలి సత్యనారాయణ చౌదరి అకా సుజనా చౌదరి - బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

నేడు శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్ట్ ధర్మాసనం పిటీషనర్‌ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ ను కొట్టివేస్తూ, డిసెంబర్‌ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తి గతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. అయితే ఆయనపై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీని ఆదేశించింది.

బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ  దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి, బ్యాంకుల నుంచి ఏకంగా   ₹5,700 కోట్లు ఋణాలను దారిమళ్ళించారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన సుజనా ఢిల్లీ ధర్మాసనం తీర్పుతో  కంగు తిన్నారు. 

నవంబర్ 24, 27 తేదీల్లో ఢిల్లీ, హైదరాబాద్‌ల్లోని సుజనా గ్రూప్‌కు చెందిన 8 చోట్ల తనిఖీలు చేపట్టిన ఈడీ ఆరు లగ్జరీ కార్లను సీజ్ చేసింది. ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ తదితర లగ్జరీ కార్లు డమ్మీ కంపెనీల పేరిట రిజిస్టర్ అయినట్టు గుర్తించింది. 

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని కూడా సుజన చౌదరి హైకోర్టుకు ఆవేదనా పూర్వకంగా తెలిపారు. బిజెపి తనను రాజకీయంగా కక్ష సాధిస్తోందని కూడా  ఆరోపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన టీడీపీ నేత సుజనా చౌదరికి కాస్త ఊరట లభించింది.

సోమవారం ఈడీ ముందు హాజరు కావాలని సుజనా చౌదరిని ఆదేశించిన హైకోర్టు, ఆయనపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోరాదని ఈడీని శుక్రవారం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల కారణంగా ఈడీ ఆయనను అరెస్ట్ చేయడం కుదరక పోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: