కేసీఆర్ కు రేవంత్ చుక్కలు చూపిస్తారా..కోడంగల్ లో 144 సెక్షన్..?

Chakravarthi Kalyan

కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొండగల్ రణరంగాన్ని తలపిస్తోంది. కీలకమైన నియోజకవర్గం కావడంతో ఇక్కడి ప్రచారంపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. దీనికి తోడు ఇటీవల టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు చేయడం కూడా కలకలం రేపింది. తాజాగా రేపు కేసీఆర్ కొండగల్ లో పర్యటించనున్నారు.


కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కొడంగల్ లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. తనపై కోపంతో కేసీఆర్ సర్కారు కొడంగల్ ను అభివృద్ధి చేయలేదేని.. కేసీఆర్ తన నియోజక వర్గానికి తీరని ద్రోహం చేశారని..అందుకే కేసీఆర్ సభ జరగనీయబోమని రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. కేసీఆర్ ను అడ్డుకుని తీరతామని ప్రకటించారు.


రేవంత్ తీరుపై టీఆర్ఎస్ మండిపడింది. ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ డీజీపీని వివరణ కోరింది. ఈ నేపథ్యంలో కొడంగల్ లో 144 సెక్షన్ విధించారు. అధికార పార్టీ ఎంతగా ధన, కండ బలాన్ని వినియోగించినా తాను లెక్కచేయబోనని.. పోరాటం ఆపేదిలేదని రేవంత్ అంటున్నారు.


తాను కొండను ఢీకొంటున్నానని.. కొండగల్ ప్రజలు తనకు సహకారం అందించాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇదిలా ఉంటే..రేవంత్ ఓటమి ఖాయమని మంత్రి కేటీఆర్ అంటున్నారు. ఓటమి ఖాయం కావడం వల్లే ఎన్నికను వాయిదా వేయించేందుకు రేవంత్ డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఏదేమైనా రేపు కేసీఆర్ పర్యటన కొండగల్ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆసక్తినెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: