డేంజర్ నుంచి తప్పించుకున్న మహేష్ బాబు

vaidya anitha

చాలా పెద్ద డేంజర్ నుంచి మహేష్ బాబు బయటపడ్డాడు అని అంటున్నారు. కారణం ఆయన సినిమా  ఈ ఏడాది విడుదలకు రాకపోవడమే అంటున్నారు. కారణం రూపాయి విలువ ఒక్కసారిగి పడిపోవడంతో కలెక్షన్లు, సినిమా బడ్జెట్ పై పెద్ద ప్రభావం చూపేవంటున్నారు.

మహేష్ కొత్త సినిమా ‘వన్’ నేనొక్కడినే యూకే లో షూటింగ్ ఉన్నప్పుడు రూపాయి విలువ 85 పైసలకు పడిపోయింది, ఇప్పుడు ఏకంగా 113 పైసలకు పడిపోయిందట. వన్ సినిమా విడుదలయ్యే నాటికి రూపాయి విలువ పెరుగుతుందన్న ఆశలో ఉన్నాడు.

అంతే కాదు రాజకీయ పరిస్థితులు కూడా సినిమాల కలెక్షన్లపై భారి ప్రభావాన్ని చూపుతున్నాయి. బంద్ ల కారణంగా బస్సులు నడవక పల్లెటూర్ల నుంచి వచ్చే వారు పట్టణాలకు వచ్చి సినిమా చూసే అవకాశాలు లేవు. ఇదే కారణంలో  నాగార్జున కూడా తన భాయ్ చిత్రాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ప్రమాదం బారినుంచి తను తప్పించుకున్నాడన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: