వైసిపి జగన్మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసులో బుధవారం హైకోర్ట్ అదేశాలిస్తే సంచలనమే!

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసు సోమవారం హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎయిర్‌-పోర్టులో దాడి జరిగితే ఏపి రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారు? అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ, కు ఎందుకు అప్పగించలేదని నిలదీసింది. 


అసలు ఈ కేసు రాష్ట్ర పోలీస్ లకు సంభందించినది కాదాని తమది కాని కేసు రాష్ట్ర పోలీసులు ఎందుకు విచారణ చేస్తున్నారు? ఈ కేసు ను ఎన్‌ఐఏ కు ఎందుకు బదిలీ చేయలేదో చెప్పాలని, పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్‌ ధాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

జగన్‌మోహనరెడ్డిపై హత్యాయత్నం కేసును రాష్ట్ర పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏ కు వెంటనే ఎందుకు బదిలీ చేయలేదో తెలుపుతూ, ఇప్పుడు వెంటనే బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ పై హైకోర్టు ఈరోజు వాదనలువిన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి తనవాదనలు వినిపించారు. సెక్షన్ 307కింద కేసు నమోదుచేసి, కావాలనే రాష్ట్ర ప్రభుత్వం విచారణను తమ పరిధిలో కొనసాగిస్తుందని న్యాయస్థానానికి తెలిపారు. 

ఎన్‌ఐఏ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఎయిర్-పోర్ట్ లేదా, ఎయిర్-క్రాఫ్ట్ లో నేరం జరిగితే దాని విచారణ ఎన్‌ఐఏ పరిధి లోకి వస్తుంద న్నారు. 'అన్-లా-ఫుల్ అగనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఎవియేషన్ యాక్ట్" ప్రకారం సెక్షన్ 3 (ఏ)కింద కేసు నమోదు చేయాలని, తమ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాకి అక్షింతలు వేసిందని పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను కావాలనే తొక్కిపెట్టినట్టు సాక్ష్యాధారాలతో కోర్టు ముందుంచామని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం విచారణను తమ పరిధిలోనే ఉంచు​కుని నాటకాలు ఆడుతోందని, దీనికి కచ్చితంగా జవాబు చెప్పవలసి  వుంటుందన్నారు. కేసు దర్యాప్తు కచ్చితంగా ఎన్‌ఐఏ పరిధిలోకి వెళుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: