రేవంత్ రెడ్డిని అరస్ట్ చెయ్యడం తప్పు కాదు ?? ఈ లాజిక్ వింటే అవును అనే అంటారు !

KSK
రేవంత్ రెడ్డి అరస్ట్ మీదనే మీడియా ప్రస్తుతం ఎక్కువగా దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి తనదైన శైలి లో మొదటి నుంచీ దూకుడు ఉన్న నేతగా దూసుకుని పోతూనే ఉన్నారు. ఈ క్రమం లో రేవంత్ రెడ్డి తాజా అరస్ట్ తెలంగాణా లో హై టెన్షన్ ని సృష్టిస్తోంది.

కోడంగల్ లో జరగబోతోన్న కెసిఆర్ సభ కి అడ్డం పడతా అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఆ వ్యాఖ్యలు రేవంత్ ఎక్కడ నిజం చేస్తాడో అని ఎలక్షన్ కమీషన్ అతన్ని హడావిడి గా అరస్టు చేయించింది. అయితే తెరాస సపోర్తర్ ల వెర్సన్ వేరే విధంగా ఉంది.

కోడంగల్ కి కెసిఆర్ ఏం చేసాడు ? ఎందుకు వస్తున్నాడు అంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి .. అతను మాత్రం అనేక ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ అనేక నియోజికవర్గాలు తిరుగుతూ ప్రచారం చేసుకోవచ్చా అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు.

రేవంత్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే ( ప్రస్తుతం మాజీ) కానీ కెసిఆర్ ఒక పార్టీ నాయకుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా కూడా ఉన్నారు .. అలాంటి కెసిఆర్ ని అడ్డుకుంటా అంటే, అడ్డుకోగాలను అని విర్రవీగితే ఎలక్షన్ కమిషన్ సరైన నిర్ణయమే తీసుకుంది అని తెరాస జనాలు లాజిక్ చెబుతున్నారు. రేవంత్ తెలంగాణా రాష్ట్రం లో ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేసుకోవచ్చు అనే లెక్కన అయితే మరి కెసిఆర్ కూడా అంతే కదా ఇది ప్రజా స్వామ్యమే కదా అంటున్నారు వాళ్ళు. కరక్ట్ టైం లో ఎలక్షన్ కమీషన్ స్పందించి రేవంత్ ని అరస్ట్ చేయించింది అని తెరాస సపోర్టర్ లు చెబుతోన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: