కెటిఆర్ కు పర్సనల్ గా మెసేజ్ చేసిన లగడపాటి అసలు సర్వే: వివరాలు

రాజకీయ నాయకులకు రాజకీయమే ప్రధానం. దానికి కేసీఆర్ కెటిఆర్ లగడపాటి వీరెవ్వరూ అతీతులు కారు. ఇక చంద్రబాబు కైతే రాజకీయమే ఉచ్వాస నిచ్వాసాలు అంటే శ్వాస. అదెంత దూరం పోయిందంటే బావమరిది నందమూరి హరికృష్ణ ప్రమాదానికి గురై మరణించిన తరవాత జన సానుభూతిని కూడా ఓట్ల రూపంలోకి మార్చుకునేంత వరకు. 


ఇకపోతే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ 7వ తారీఖు తరవాతే వెల్లడిస్థానని చెప్పిన సర్వే ఫలితాలు "వాయిదాల పద్దతిలో వెల్లడించిన సర్వే" ఫలితాలను తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు కలవకుంట్ల తారక రామారామారావు తప్పు పట్టారు. ఎందుకు పట్టరు. లగడపాటి మాట తప్పారు. ఎందుకంటే తనే వచించిన తన సర్వేలో వెల్లడైన ఫలితాలను వివరిస్తానని ఒక తారీఖు ఫిక్స్చేసి - ఆ తారీఖు ప్రకటించి - రాజకీయ కారణంగానో, కుల కారణంగానో, పదవీదాహం కారణంగానో, మనసు మార్చుకొని వాయిదాల పద్దతిలో సర్వే విడుదల చేయటం - సాధారణంగా సర్వే పలితాల విడుదల చేసే విధానానికి సుదూరంగా ఉంది. లగడపాటి సర్వే ప్రకటనపై జన విశ్వాసం సన్నగిల్లినట్లే. 

మొన్న సిపీఎస్ సర్వేని అందరూ నమ్మలేదు. ఇప్పుడు అదేస్థాయికి లగడపాటి తనసర్వేలోని నిజయితీని దిగజార్చుకున్నారు. తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్ర బాబు  నాయుడు తనపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగా లగడపాటి తన సర్వేని శాస్త్రీయతకు సుదూరం జరిపి రాజకీయ సర్వే విడుదల చేశారు. అదే మాత్రం నమ్మదగి నదిగా లేదని తటస్థులు విశ్లేషకులు అంటున్నారు.  


"టిఆర్ఎస్ పార్టీకి 65 నుంచి 70 సీట్లు" వస్తాయంటూ లగడపాటి రాజగోపాల్ తనకు గత నెల 20వ తేదీన మెసేజ్ పంపించారని అంటూ లగడపాటి పంపిన మెసేజ్ ను కేటీఆర్ ట్విట్టర్ లో  షేర్ చేశారు. కేవలం చంద్రబాబు కుట్రను ప్రజలకు తెలియజేసేందుకు లగడపాటి తనకు పంపిన మెసేజ్ ను షేర్ చేయాల్సి వస్తుందని కెటీఅర్ అన్నారు.


అయితే నవంబర్ 20నాటికి ఆ పరిస్థితి ఉన్నదని, ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకునే తీరు గురించి తనకు పూర్తి అవగాహన ఉన్నదని లగడపాటి అన్నారని,  తన అంచనాలకు మించి టిఆర్ఎస్ పార్టీ సీట్లు గెలుచుకున్నా తనకు ఆశ్చర్యం లేదన్నారని కేటీఆర్ వివరించారు.  ఇదే విషయం జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్ కు పంపిన మెసేజ్ లో తెలిపారు.

దీంతో లగడపాటికి ఆయన అభిమానులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆంధ్రా ఆక్టోపస్ సర్వే పలితాలపై నీలి నీడలు కమ్ముకున్నాయని చెప్పక తప్పదు. నారా చంద్రబాబు నాయుడు ఎన్నికోట్ల మంది భావాలనైనా తన రాజకీయ ప్రయోజనాలకోసం కలుషితం చేస్తారనేది మరోసారి ఋజువైందని అనుభవఙ్జులైన విశ్లేషకుల భావన. పది కోట్లకు పైబడ్ద తెలుగువారి మనసులను కలుషితం చేయటానికి బిందెడుపాలలో ఒక విషబిందువు లాంటి ఈయన చాలు అనెది నగ్న సత్యం.


చివరకు ఆంధ్రా ఆక్టోపస్ చిలకలా మారిపోయింది! విశ్వాసం దెబ్బతింది.


ఈ విషయంలో వారిద్దరి మధ్య జరిగిన ట్వీట్ వినిమయం చాట్‌కు సంబంధించిన "స్క్రీన్‌ షాట్లను కేటీఆర్‌ ట్వీట్‌ ద్వారా షేర్ చేశారు. సర్వే పేరుతో కుట్ర చేసి  టీఆర్‌ఎస్‌ ను  దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న కారణంగానే ఈ సీక్రెట్‌ చాట్‌ ను బయట పెట్టక తప్పడం లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. 


View image on Twitter
KTR
✔@KTRTRS
The reason I dismiss Rajgopal’s survey as concocted;
his message to me on 20th Nov that TRS is winning 65-70 seatsIt’s the same survey he shared today under pressure from CBN with cooked up numbersP.s: I had no choice but to share this conversation to break the conspiracy

3,751
10:38 PM - Dec 4, 2018


లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని కెటీఅర్ ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే ట్వెల్త్ అవర్ (లాస్ట్‌ మినిట్‌) ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్‌ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్‌ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: