సుహాసినికి మద్దతుగా ఎన్టీఆర్-కల్యాణ్ రామ్ ప్రచారం ఇక లేనట్లే: కూకటపల్లి టిడిపికి షాక్

అత్యంత ప్రతిష్టాత్మక కూకట్‌ పల్లి నియోజకవర్గం లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికల ప్రచారానికి మిగిలి ఉన్న సమయం ముగుస్తుండటంతో వారంతా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు. నందమూరి సుహాసినికి మద్ధతుగా ఆమె సోదరులిరువురూ జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రచారం చేయ బోవటం లేనట్లేనని స్పష్టమైన సంకేతాలు అందటంతో అభిమానులు పూర్తిగా నీరుగారిపోయారు.

ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువు ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగుస్తుండటంతో పాటు నేటి ప్రచార కార్యక్రమంలో ఎక్కడా ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ పేర్లు ప్రకటించబడలేదు. దీంతో టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ ప్రచారంపై ఆశలు వదిలేసుకున్నారు. అన్నదమ్ములిద్దరూ తీరిక లేకుండా సినిమా షూటింగుల్లో, మునిగిపోయి ఉండటంతో వారు ప్రచారానికి రాలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీవర్గాలు భావిస్తున్నాయి. కూకట్‌ పల్లి నుంచి నందమూరి వారి యింటి అమ్మాయి నందమూరి తారక రామారావు మనమరాలు, హరికృష్ణ తనయ నందమూరి సుహాసినీ ఎన్నికలల సమర రంగంలో నిలబడటంలో  ఆమెకు మద్ధతుగా నందమూరి కుటుంబం మొత్తం ప్రచారానికి సిద్ధమైంది.

టీడీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, తారకరత్నతో పాటు దివంగత నందమూరి జానకీ రామ్ భార్య, హీరో తారకరత్న ప్రచారం చేశారు. సుహాసిని గెలుపు కోసం ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం రంగంలోకి దిగడంతో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ ‌తప్పకుండా వస్తారని అందరూ భావించారు.

సుహాసినికి మద్దతు తెలియజేస్తూ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇప్పటికే ఒక ప్రకటనను విడుదలచేశారు. అయితే ప్రచారంలో పాల్గొనాలనుకుంటే ముందే రాష్ట్రఎన్నికల సంఘానికి లేఖరాసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రయత్నం చేసిన దాఖలాలులేవు. దీంతో ఎన్టీఆర్ సుహాసిని ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.  
   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: