జగన్ పై హత్యాయత్నం కేసు కేంద్ర సంస్థ కేనా? చందరబాబు పరిస్థితి చిందర వందరేనా?

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం - హైకోర్టు ఈ రోజు బుధవారం మరోసారి విచారించింది.  వైఎస్‌ జగన్‌మోహనరెడ్డిపై హత్యాయత్నం ఘటనలో కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14లోపు ఎన్‌ఐఏ కి కేసును బదిలీ చేయాలా? వద్దా ? అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని, ఎన్‌ఐఏ కేసు దర్యాప్తు చేసి ఉంటే నివేదికను సీల్డ్‌ కవర్‌ లో ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. 

ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చామని సీఐఎస్‌ఎఫ్‌ పేర్కొంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున కేసు దర్యాప్తుపై న్యాయస్థానంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్వొకేట్‌ జనరల్‌ వాదన లు వినిపించారు. ఈ కేసు సెక్షన్(3) కిందకు రాదని ఏజీ తెలిపారు. ఏజీ వాదనతో హైకోర్టు ఏకీభవించ లేదు. ఏపీ ప్రభుత్వతీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఈ నెల 14 కు వాయిదా వేసింది. 

ఇటీవల విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ మాట్లాడిన నేపథ్యంలో, ఈ కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ జగన్‌మోహనరెడ్డి హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఇదే సమయంలో ఆయన ఒక అదనపు అఫిడవిట్‌ ను కూడా దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్న ఘటన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధి లోకి వస్తుందని, పౌర విమానయాన భద్రత చట్ట నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటన లపై దర్యాప్తు చేసే అధికారం ఎన్‌ఐఏకు ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం అందరికీ తెలిసిందే.  



జగన్ సీఎం అవుతాడనే హత్యకు కుట్ర: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డిపై జరిగిన హత్యాయత్నం వెనుక కుట్ర దాగుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కాగా ఆయన పై దాడి కేసు కు సంబంధించి హైకోర్టు  సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు నాయుడు అవినీతిపై అటు శాసనసభ లోను ప్రజాక్షేత్రంలోను నిరంతరం ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న జగన్మోహనరెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడో అనే ద్వేషం తోనే హత్యకు కుట్రపన్నారు.



కోర్టులో అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యల్ని హైకోర్టు తప్పుబట్టింది, మీరు ప్రభుత్వ న్యాయవాది కానీ చంద్రబాబు న్యాయవాది కాదు. న్యాయ స్థానాన్ని తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు ఏజీ మాట్లాడారు. మీకు ప్రజల పన్నుల నుంచి జీతం తీసుకుంటూ, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ప్రజలకు సేవ చేయటానికి బదులు చంద్రబాబు ప్రభుత్వ తప్పుల్ని కప్పిపుచ్చటానికి శ్రమ పడటానికి కాదు అని అన్నారు.  


*ఎన్‌ఐఏ యాక్ట్, 
*సివిల్ ఏవియేషన్ యాక్ట్‌ లు

స్పష్టంగా చెప్తున్నా డీజీపీ ఎందుకు అనుసరించలేదో అర్ధం కావడం లేదు అన్నారు  మీకు చట్టం తెలికపోతే డీజీపీ పదవికి మీరు అనర్హులు. చంద్రబాబును కాపాడటాని కే ఈ కేసును డీజీపీ, ఏపీ పోలీసులు చేతిలోకి తీసుకున్నారు.

ఎయిర్ పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదు. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ ఎలా మాట్లాడతారు. ఎఫ్ ఐ ఆర్ 4.00 గంటలకు రిజిస్తర్ చేయగా…దానికి ముందే దిగిపి పత్రికలకు జగన్ అభిమానే ఈ చర్యకు పాల్పడ్డాడని అతను ఎస్సి కులానికి చెందినవాడని చెప్పటం మొత్తం రాష్ట్రా న్ని షాక్ కు గురిచేసిందని అన్నారు.

ఇలా మాట్లాడటం ద్వారా హత్యాయత్నంను, తప్పుదారి పట్టించడమే మీ ఉద్దేశమా?  పోలీస్ మాన్యువల్ స్పష్టంగా ఉంది, మీకు తెలీదా డీజీపీ గారు?  నేను డీజీపీపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తా. ఎఫ్‌ఐఆర్ నమోదు కాక ముందే డీజీపీ ఎలా స్పందించారు? చంద్రబాబు ఒత్తిడి మేరకే డీజీపీ వ్యవహరించారు. ఇప్పుడు కేసు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అదిజరిగాక అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. హైకోర్టు కూడా ఈ రోజు స్పష్టంగా వ్యాఖ్యనించింది. కేసు ఎన్‌ఐఏ పరిధి లోకి వెళ్తే ప్రత్యేక కోర్టు విచారణ చేస్తుంది, అప్పుడు అన్ని విషయాలు బయటికి వస్తాయి. 

చంద్రబాబు నాయుడును కాపాడేందుకే చట్టాలను అతిక్రమించి కేసు రాష్ట్ర పరిధిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కేసు ఎన్‌ఐఏ పరిధి లోకి వెళ్తుంది. ఈ కేసును కాలంటే కేంద్రం సుమోటోగా కూడా తీసుకుని దర్యాప్తు చేయచ్చు అని హైకోర్టు వ్యాఖ్యనించింది. 

ఎయిర్ పోర్ట్, విమానంలో, ప్రయాణంలో ఇలాంటి సంఘటనలు జరిగితే  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 15 రోజుల లోపు ఎన్‌ఐఏకి అప్పచెప్పాలని చట్టాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఇలాంటి దుర్మార్గాలు ఎన్ని ఒడిగట్టినా 2019ఎన్నికలలో ప్రజల అండతో  వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం’ అని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: