జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు

ఐదు రాష్ట్రాల శాసనసభ నియోజక వర్గాల ఎన్నికల సెమీ ఫైనల్స్‌ ముగిశాయి. అసలు ఫలితాలు 11 వ తేదీన వెల్లడి కానున్నాయి. లోక్ సభ ఎన్నికలు 2019లో జరగనున్ననేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఐదు రాష్ట్రాల శానససభ ఎన్నికలను వాటికి సెమీ-ఫైనల్స్ గా భావించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల పలితాలు జాతీయ రాజకీయాల దృష్ట్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.


అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ పోలింగ్‌ ముగియగానే. అన్నివార్తా చానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో - రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ -బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్, మిజోరంలో కాంగ్రెస్‌ పవర్‌లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్‌ కాంగ్రెస్‌ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్‌ చేజారనుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చి చెప్పాయి.

 

తెలంగాణలో మళ్లీ టీఆర్‌ఎస్‌ కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెల కొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచు కోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి.  

అసలు ఫలితాలు ఈ నెల 11వ తేదీన వెలువడనున్నాయి.

మిజోరం రాష్ట్ర 40 శాసనసభ నియోజక వర్గాల ఎన్నికల ఎగ్టిట్ పోల్ ఫలితాలు 2018


సి ఓటర్ 

 ఎమ్ఎన్ఎఫ్: 16-20 కాంగ్రెస్ * 14-18 జెడ్పిఎమ్ * 3-7 ఇతరులు  

మధ్య ప్రదేశ్ రాష్ట్ర 230 శాసనసభ నియోజకవర్గాల ఎగ్జిట్ పోల్  ఫలితాలు 2018


ఇండియా టుడే యాక్సిస్ 

 కాంగ్రెస్ 104 - 122 (41) బీజేపీ 102 - 120 (40)  బీఎస్పీ 1-3 ఇతరులు  3-8

 టైమ్స్ నౌ:

 బిజెపి 126 కాంగ్రెస్ 89 బీఎస్పీ 6 ఇతరులు

 ఆజ్ తక్ 

 బిజెపి 102-120 కాంగ్రెస్ 104-122 బీఎస్పీ 0 ఇతరులు 4-11

 జన్ కీ బాత్ సర్వే

 కాంగ్రెస్ 95-115 బిజెపి 108-128 బిఎస్పీ 0-0 ఇతరులు 0-7

 ఎబిపి న్యూస్

 కాంగ్రెస్  126  బిజెపి  94 ఇతరులు  10  

 చత్తీస్‌గఢ్రాష్ట్ర 90 శాసనసభ నియోజక వర్గాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు-2018

 

టైమ్స్ నౌ సిఎన్ఎక్స్  

 బీజేపీ...46,  కాంగ్రెస్....35, బీఎస్పీ+ 7  ఇతరులు 2

న్యూస్ 24 ఫెస్ మీడియా 

 బీజేపీ 36-42 కాంగ్రెస్ 45-51 బీఏస్పి +0 ఇతరులు 4-8

 ఇండియా టివి 

 బిజెపి.... 42-50 కాంగ్రెస్... 32-38 బీఎస్పీ+ 6-8 ఇతరులు..1-3

 రిపబ్లిక్ సి ఓటర్ 

 బిజెపి 35-43 కాంగ్రెస్ 40-50 బీఎస్పీ (+) 3-7 ఇతరులు - 0

 న్యూస్ నేషన్ 

 బీజేపీ 38-42 కాంగ్రెస్ 40-44 బీఎస్పీ 4-8 ఇతరులు 0-4

 ఇండియా టీవీ 

 బీజేపీ 42-50  కాంగ్రెస్ 32-38  బీఎస్పీ 6-8 ఇతరులు 1-3

 ఎబిపి న్యూస్

 కాంగ్రెస్  32-38  బిజెపి 42-50 జనతా కాంగ్రెస్ 6-8  ఇతరులు 1-3

 ఇండియా టుడే యాక్సిస్ 

బిజెపి : 21-31 కాంగ్రెస్ : 55-65 జనతా కాంగ్రెస్, బిఎస్పీ : 4-8

రాజస్థాన్ రాష్ట్ర 199 శాసనసభ నియోజక వర్గాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2018

ఇండియా టుడే యాక్సిస్ 

బీజేపీ 55-72 కాంగ్రెస్ 119-141 ఇతరులు 4-11

 టైమ్స్ నౌ సిఎన్ఎక్స్  

 బీజేపీ 85 కాంగ్రెస్ (+)105 బీఎస్పీ 2 ఇతరులు 7

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: