అద్భుతం..వజ్రాల విమానం మహా అద్భుతం?!

Edari Rama Krishna
మనిషి తల్చుకుంటే ఏదైనా సాధించగలడు..ఇప్పటి వరకు ఎన్నో వినూత్న పరికరాలు ఆవిష్కరించి ఆశ్చర్యాన్ని కలిగించారు. ఇక తాము ఉపయోగించుకునే పరికరాలు..వాహనాలు రక రకాలుగా తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక టెక్నాలజీ వచ్చిన తర్వాత లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  రెండు రోజుల క్రితం ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.  నిండా వజ్రాలతో ధగధగా మెరుస్తూ. మన దగ్గర ఒక్క వజ్రం ఉన్నా చాలు జన్మ ధన్యమవుతుందని భావించారు నెటిజన్లు.  

ఇంతలా ఆకర్షించడానికి ఏముందా ఫోటోలో అని ఆలోచిస్తున్నారా.. ఎందుకంటే ఆ విమానం వేల వజ్రాల కాంతితో మిరిమిట్లుగొలుపుతోంది. దాంతో చూసిన వారికి ఇది వజ్రాలు పొదిగిన విమానమేమో అనే అనుమానం వచ్చింది. కానీ ఇది నిజంగా వజ్రాలు పొదిగిన విమానం కాదు.  నిజానికి సారా షకీల్‌ అనే ఆర్టిస్ట్ రూపొందించిన చిత్రం ఇది. ఈ విషయాన్ని ఎమిరేట్స్ తన పోస్ట్‌లో చెప్పినా, చాలా మంది అది చదవకుండా షేర్ చేస్తున్నారు. కొందరు చదివి కూడా సరదాగా ఫ్రెండ్స్‌కి ట్యాగ్ చేస్తున్నారు.. ఆమె ఇలాంటి ఎన్నో చిత్రాలను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు.

ఆమె సృష్టించిన ఈ కళాఖండాన్ని మాత్రమే మేం పోస్టు చేశాం. ఇది నిజం కాదు  అంటూ సదరు అధికారి  మీడియాకు స్పష్టం చేశారు.  ప్రముఖ క్రిస్టల్‌ ఆర్టిస్ట్‌ అయిన సారా షకీల్‌.. ఈ అద్భుత చిత్రాన్ని రూపొందించి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.  అది కాస్తా ఎమిరేట్స్‌ సంస్థను ఆకర్షించింది. వెంటనే వారు ఆమె అనుమతితో ఈ ఫొటోను రీపోస్టు చేశారు.
Presenting the Emirates ‘Bling’ 777. Image created by Sara Shakeel 💎💎💎 pic.twitter.com/zDYnUZtIOS

— Emirates Airline (@emirates) December 4, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: