మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?

ఓటర్ల జాబితా లో పేరులేదని తను గతంలో నాలుగు సార్లు ఓటేశానని ఓటర్ కార్డ్ చూపుతూ ఏంతో ఆందోళనకు గుఱైన తెలంగాణా లో ఎన్నికల బూతుల ముందు దేవులాడే ఓటర్ల సంఖ్య తలదిరిగేలా ఉంది. ఆ సంఖ్య 27 లక్షలట. అంటే దాదాపు మొత్తం తెలంగాణా ఓటర్ల సంఖ్యలో 10 శాతం  అన్నమాట. ఈ దౌర్భగ్యానికి కారణ మెవరు? తెలంగాణాలో ఓటింగ్ శాతం 73%. ఇలా ఓటర్ల మిస్సింగ్ జరగ కుండా ఉంటే అది 83% శాతం వరకు ఉండేది. తెలంగాణాలో ఎవరు గెలిచినా ఆ విజయం సంపూర్ణంగాదు. కారణం మొత్తం విజయాన్ని ప్రభావితం చేయగల సంఖ్యలో ఓటర్లకు ఓటు హక్కు వినియోగించు కోలేని పరిస్థితులను కపించింది ఎన్నికల సంఘం. 

అంతేకాదు కొందరికి రెండు చోట్ల ఓటర్ల లిస్ట్ లో పేర్లు. ఒకే ఓటర్ కు పక్క పక్క ఇళ్ళలో ఓట్లు. దొంగ ఓట్లు, పాడుబడిన ఇళ్ళ అడ్రస్ లో వందల సంఖ్యలో ఓట్లు. ఇలా చెపుతూ పోతే ఎన్నికల సంఘం నిర్వాకం, వీరి చిత్ర విచిత్ర లీలలు ప్రశ్నార్ధకమే?  అయితే ప్రముఖ పత్రిక ఈ వార్త రాసినందుకు ఎన్నికల సంఘం అధికారొకరు పోన్ చేసి బెదిరించిన వార్తలు ప్రజాస్వామ్య సమాజానికి సిగ్గు చేటు.

"రాజ్యాంగబద్ద సంస్థపై ఇష్టం వచ్చినట్లు వార్తలా? ఎన్నికల నిర్వహణలో ఈసీ ఫెయిల్ అంటూ వార్తలు రాస్తారా? లీగల్ నోటీసులు ఇస్తాం!’ అంటూ హుంకరించారట.  
తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందిన ఒక ఎన్నికల అధికారి. ఇప్పుడు  ఈ వ్యవహారం మీడియా సర్కిల్స్ హాట్-టాపిక్ గా మారింది. ఎన్నికల నిర్వహణలో ఘోరంగా విఫలమవటమే కాకుండా, వార్తలు రాసిన మీడియాను బెదిరించటం ఏమిటన్న చర్చ మొదలైంది. 

గతంలో ఎన్నడూ లేని రీతి లో ఓటింగ్ ముగిసిన 29 గంటల తర్వాత కానీ తుది పోలింగ్ శాతం ఇచ్చిన ఘనత కూడా తెలగాణా ఎన్నికల సంఘానిదే. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. సాంకేతిక అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా ఓటింగ్ పూర్తయిన రోజు అర్థరాత్రి చాలా వరకూ తుది ఓటింగ్ శాతాలు అందేవి. కానీ టెక్నాలజీ ఎంతో అప్-గ్రేడ్ అయినా కూడా తెలంగాణ ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణ విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంది. 

తెలంగాణా ముందస్తు ఎన్నికలకు ముహుర్తం ఖరారు అయినప్పటి నుంచి అర్హులైన వారి ఓట్లు తొలగింపు, జాబితాల నిండా బోగస్ ఓట్లు, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగింపు, ఒకే ఊరులో వేలల్లో ఓట్లు మాయమవ్వటం ఇలా అనేక పారదర్శకతలేని జుగుప్సాకరమైన అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వచ్చాయి. తెలంగాణా ఎన్నికల సంఘం ఒకే అన్నతరవాతే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. 

అయినా వాళ్ళ ఇష్టంప్రకారం ఏవో కొన్ని మార్పులుచేసి ముందుకు సాగారు. సాక్ష్యాత్తూ తెలంగాణ ముఖ్యఎన్నికల అధికారి రజత్ కుమార్ ఏకంగా మీడియా సాక్షిగా పొరపాటు జరిగిందని అంగీకరించారు కూడా! ఇవన్నీ వదిలేసి రాజ్యాంగ బద్ద సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తలు రాశారని తిరిగి ప్రచార సాధనాలైన పత్రికలను, చానళ్ళ ను  బెదిరించటం ఏమిటని అధికారవర్గాల్లోనూ చర్చ జరగుతోంది. 

ఈ శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కూడా  ఈ వ్యవహారంపై అసంతృప్తి తో ఉన్నట్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: