దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!

siri Madhukar
తెలంగాణలో ఇప్పటి వరకు జరుగుతు ఎన్నికల ఫలితాలల్లో కాంగ్రెస్ మొదట ఊపందుకున్నా తర్వాత  ఢీలా పడుతూ వస్తుంది.  ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న కొద్దీ కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్న స్థానాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తొలుత 24 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు లీడింగ్ లో ఉండగా, ఇప్పుడా సంఖ్య 18కి పడిపోయింది.  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది.

మొత్తం 119 స్థానాలకు కౌంటింగ్ శరవేగంగా సాగుతుండగా, ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు టీఆర్ఎస్ 84 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇదే సమయంలో టీఆర్ఎస్ 85 చోట్ల లీడ్ లోకి వెళ్లింది. బీజేపీ 4, ఎంఐఎం 3, ఇతరులు 2 చోట్ల లీడ్ లో ఉన్నారు. పలువురు ప్రముఖ కాంగ్రెస్ నేతలు వెనుకబడివున్నారు. 

ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థుల జాబితాలో ఉంటారని భావించిన కుందూరు జానారెడ్డి (నాగార్జున సాగర్), మహిళకు అవకాశం వస్తే సీఎం పదవి దక్కుతుందని భావించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి (కోదాడ)లతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డీకే అరుణ తదితరులు వెనుకబడివున్నారు. 

ఇక మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా, ఇప్పటికే టీఆర్ఎస్ అదనంగా మరో 24 చోట్ల మెజారిటీ చూపుతుండటం గమనార్హం. యాకత్ పురాలో అనూహ్యంగా ఎంఐఎం వెనుకబడగా, బీజేపీ ముందంజలో నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: