TRSకు షాక్.. నలుగురు మంత్రులు ఓటమి.. స్పీకర్ కూడా!

Chakravarthi Kalyan

తెలంగాణ ఎన్నికల్లో కారు దూసుకుపోయినా...అక్కడక్కడా ఇబ్బందులు తప్పలేదు. ప్రత్యేకించి ఆ పార్టీకి చెందిన మంత్రులు ఓడిపోవడం సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.


తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. చంద్రబాబు సన్నిహుతుడుగా పేరున్న ఈయన ఆ తర్వాత అనూహ్యంగా తెరాసలో చేరారు. ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి కూడా చేపట్టారు. 2016లో పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎన్నికయ్యారు.

తాజాగా మంత్రి పదవిలో ఉండి.. అదే పాలేరు స్థానం నుంచి తుమ్మల ఓడిపోవడం నిజంగానే టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. వాస్తవానికి పాలేరు నియోజకవర్గానికి తుమ్మల చాలా సేవ చేశారు. భక్తరామదాసు ప్రాజెక్టును పట్టుబట్టి నిర్మించి రైతులకు నీరు ఇచ్చారు. అందులోనూ తుమ్మలపై పోటీ చేసి గెలిచిన ఉపేందర్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా కొత్తవాడు కావడం విశేషం.



మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఓడిపోయారు. కొల్హాపూర్ నుంచి పోటీ చేసిన కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మరోవైపు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి కూడా ఓటమి దిశగా పయనిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: