మోడీ పండగ చేసేకునే వార్త.. రాహుల్‌ కు బిగ్‌ షాక్..?

Chakravarthi Kalyan

వరుస దెబ్బలతో ఇబ్బంది పడుతున్న మోడీకి బ్రహ్మాండమైన గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ రోజూ విమర్శలతో కడిగేస్తున్న రాఫెల్ అంశంలో మోడీకి బ్రహ్మాండమైన ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ ఒప్పందం విషయంలో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది.



రాఫెల్‌ ఒప్పందం విషయంలో అనుమానించాల్సింది ఏమీ కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ ఒప్పందంపై దాఖలైన అన్ని పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. రాఫెల్ ఒప్పందంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం అని అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకున్న విధానంలో ఎలాంటి సందేహాలు కలగలేదని వివరించింది.



రాఫెల్ ఒప్పందంపై దాఖలైన 36 పిటిషన్లను సుప్రీంకోర్టును కొట్టివేసింది. యుద్ధ విమానాల ధరల విషయాలను నిపుణులు చూసుకుంటారని, తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 36 యుద్ధవిమానాలను 56వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు మోదీ సర్కారు ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇటీవల రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.



రిలయన్స్ సంస్థల యజమాని అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. చౌకీదార్ చోర్ హై అంటూ సెటైర్లు పేల్చారు. ఈ విషయంపై బీజేపీ కూడా గట్టిగా ఎదురుదాడి చేయలేకపోయింది. మోడీ కూడా మౌనం వహించడంతో కమల దళం డిఫెన్సులో పడిపోయింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో మోడీ సర్కారుకు ఊరట లభించింది. రాహుల్ క్షమాపణ చెప్పాలని ఇప్పుడు కమలనాధులు డిమాండ్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: