ఆంధ్రలో కేసీఆర్ అడుగుపెట్టడం పై స్పందించిన జగన్…!

KSK
ప్రస్తుతం వైసిపి అధినేత ప్రతిపక్ష నేత జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల తెలంగాణ రాజకీయాలలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ త్వరలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగుపెడతానని చేసిన కామెంట్లపై తనదైన శైలిలో స్పందించారు జగన్. కెసిఆర్ అడుగు పెట్టడం వల్ల వైసిపి పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని కెసిఆర్ ప్రకటనతో ఎక్కువ భయపడుతున్నది చంద్రబాబేనని స్పష్టం చేశారు జగన్.


అయితే కేసీఆర్ ఆంధ్ర రాజకీయాలలో అడుగుపెడతారని ప్రకటించిన క్రమంలో ఆ బురదను తనకు జిల్లాలోని నీచమైన రాజకీయాలకు చంద్రబాబు మరియు ఆయనకు మద్దతు తెలిపే మీడియా అనేక కుయుక్తులు పన్నుతున్నారని ప్రజలకు తెలియజేశారు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఒత్తు పెట్టుకోక ముందు టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారన్న వార్తలు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులే తెలిపారని..అయితే ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండి ఉంటే ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలిసే వారా అని ప్రశ్నించాడు.


విభజనతో అనేక సమస్యలతో రాష్ట్రం నిండి ఉండి ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడతా.. దేశాన్ని కాపాడుతా అంటూ దేశం మొత్తం పర్యటించడం...చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.


రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి సామాన్యుడికి తెలిసినా...ముందు నుండి ప్రజలు సమస్యల కోసం..ప్రత్యేక హోదా కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉంది ఉండి ఉంటే..అది వైసీపీ పార్టీ అని..అన్ని పార్టీలు చంద్రబాబు చెప్పిన అబద్ధాలకు మద్దతు తెలిపితే..ముందునుండి ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని..ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు వస్తాయని నిలబడిన పార్టీ వైసీపీ పార్టీ అని జగన్ ..ప్రజలకు తెలియజేశారు .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: