చంద్రబాబుపై జగన్ కడుపు మంట.. అందుకేనట..?

Chakravarthi Kalyan

ప్రతిపక్షం అంటే ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపాలి. ప్రజల తరపున పోరాడాలి. అలాగని ఊరికే ప్రతి విషయానికీ సర్కారును తప్పుబట్టకూడదు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.. ఇదీ టీడీపీ చెబుతున్న మాటలు. ఇవన్నీ ఎవరి గురించి టీడీపీ చెబుతున్నారో తెలుసుగా.. ఇంకెవరూ.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీరు గురించే.


ఈ మధ్య జగన్‌కు చంద్రబాబుపై కడుపు మంట బాగా పెరిగిపోయిందట. ఈ మాటలు చెబుతున్నదీ టీడీపీ నేతలే. పెథాయ్ తుపాను ఏపీకి ఓవైపు కబళిస్తుంటే.. చంద్రబాబు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాలకు వెళ్తూ ప్రజలను గాలికి వదిలేస్తున్నారని జగన్ విమర్శించారు. అదీ సంగతి.. ఇదంతా జగన్ కడుపు మంట అంటున్నారు టీడీపీ నేతలుఆ కడుపు మంటకు అద్భుతమైన కారణం కూడా చెబుతున్నారు.


దేశంలో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాలకు ఎవరూ జగన్‌ను పిలవ లేదట. అంతా చంద్రబాబునే పిలిచారట. అదుగో.. ఆ కడుపుమంటతోనే జగన్ ఇలా అడ్డగోలు విమర్శలు చేస్తున్నాడట. ఇదీ టీడీపీ మంత్రుల ఆరోపణ. పెథాయ్‌ తుఫానును రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటుంటే ప్రతిపక్షాలు మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ మంత్రులు మండిపడుతున్నారు.



ప్రకృతి వైపరిత్యాలను కూడా వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అంటున్నారు టీడీపీ మంత్రులు. నిన్నకాక మొన్న తిత్లీ తుఫాను వస్తే 70 కిలోమీటర్లు వెళ్లి బాధితులను పరామర్శించకుండా 750 కిలోమీటర్లు వెళ్లి లోటస్‌పాండ్‌లో జగన్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ నేతలతో కుట్ర రాజకీయాలు చేశారని కూడా ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సమర్థంగా తుపానును ఎదుర్కొంటుంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి ఆ పార్టీ కార్యకర్తలను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు కూడా ఇవ్వలేదని తప్పుబడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: