ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అవమానం..?

Chakravarthi Kalyan

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటాడీ ఎమ్మెల్యే. సహజంగానే దూకుడు ఎక్కువ. మీడియా ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా ఎవరిమీదకైనా చేయి లేపేస్తాడని పేరు. ఆయనకు కోపం వస్తే చేయి చేసుకోవడం చాలా కామన్.



అలాంటి చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాకపోతే.. ఈసారి వెరైటీ.. ఎప్పుడు ఎవరో ఒకరిపై దాడి చేసే చింతమనేని ప్రభాకర్.. ఈసారి బాధితుడిగా వార్తల్లోకి వచ్చారు. అసలేంజరిగిందేట.. కాజా టోల్‌ గేట్ దగ్గర సిబ్బంది ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారట.



టోల్‌గేట్‌ వద్దకు వచ్చిన చింతమనేని కారును టోల్ సిబ్బంది నిలిపివేశారట. కాను ఎమ్మెల్యేనయ్యా బాబూ అంటున్నా వినకుండా ఆపేశారట. ఎంత చెప్పినా విడిచిపెట్టలేదట.దీంతో ఎమ్మెల్యే చింతమనేనికి చిర్రెత్తికొచ్చిందట. అంతే వారిపై ఆగ్రహం వ‌్యక్తం చేసి.. కారును టోల్‌గేట్ వద్దే వదిలేశారట.



అటుగా వచ్చిన ఓ బస్సు ఎక్కి వెళ్లిపోయారట. ఎమ్మెల్యే కారు టోల్ గేట్ దగ్గరే వదిలేయడంతో టోల్ గేట్ సిబ్బంది ఇబ్బంది పడ్డారట. మరి అంతగా కోపం వస్తే ఆ టోల్ ఫీజేదో కట్టేసి ఆ తర్వాత వారి సంగతి చూసుకోవచ్చు కదా. కారు అక్కడే వదిలేసి వెళ్లడం ఎందుకో.. ఏదేమైనా ఈ ఎమ్మెల్యే వెరైటీ నిరసన ఆసక్తికరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: