బండ్ల గణేష్ పీక కొసు కోరట? ఏం చెప్పారో కామెడీగా! మీరు చదవండి

అర్హత లేని అందలం అందుకోవటానికి ఆరాట పడటం అవమానమే. తన సామర్ధ్యాన్ని అతిగా అంచనా వేసుకోవటం అర్హతకి మించి పోరాడటం కూడా కూడదు. ఈ రెండు అత్యంత ప్రమాదకరమైన విషయాలే. ఏమీ లేకుండా ఎగిరెగిరి పడేతే "ఏమీ లేని విస్తరిగా గాలికి కొట్టూకుపోవటమే" ముందు మీడియా గొట్టంగాని వేదికపై మైక్ దొరికినప్పుడు రాజకీయ నాయకులకు పూనకం వచ్చి నోటి కొచ్చినట్లు మాట్లాడితే మాత్రం పరిస్థితికి ఉదాహరణగా మన బండ్ల గణేష్ ను చూపవచ్చు. 

కాలు జారితే చికిత్స చేసుకొని బయట పడొచ్చు కాని మాట జారితే దాని పర్యవసానం ఏ మలుపు తీసుకుంటుందో బండ్ల గణేష్‌ కి తెలిసినంతగా ఎవరికీ తెలియక పోవచ్చు. బాగా తెలిసొచ్చింది. అయితే గతంలో చాలా మంది నేతలు బాహాటంగానే మాటిచ్చినా, మాట తప్పినా ఇంతలా టార్గెట్ కాలేదు. కాని బండ్ల గణేష్ ప్రసిద్ధ సినీ నిర్మాత నటుడు అందుకే ఆయన విషయంలో దృశ్యం వెనక్కి నడిచింది. బండ్ల గణేష్‌ తెలంగాణాలో కాంగ్రెస్ ఓడిపోతే "బ్లేడ్‌తో పీక కోసుకుంటా!" అని శపధం చేశారు. కాంగ్రెస్ అత్యంత పరాభవంతో ఓడిపోగా - ఆయ్న చేసిన శపథం వలన సోషల్ మీడియాలో ఆయన పీకను జోకులు, వ్యాఖ్యలతో పీస్ పీస్‌లు, ఖైమా కొట్టేస్తున్నారు నెటిజెన్లు.  

తెలంగాణా ఎన్నికల ఫలితాల తరవాత ఇంత అత్యధికంగా ట్రోల్ కాబడ్డ వ్యక్తి మరొకరు లేదంటుండగా - కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే పీక కోసుకుంటా అన్న మాటకు.. ఏకంగా బ్లేడ్ పట్టుకుని ఆయన ఇంటికే వెళ్లాడు ఒక అత్యుత్సాహపు వార్తా రిపోర్టర్. కాగా.. ఎన్నికల ఫలితాల నుండి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయిన బండ్ల గణేష్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌ లోని ప్రముఖ దేవాలయంలో దైవ దర్శనం చేసుకున్న సందర్భంగా అక్కడ ఉన్న మీడియాకు చిక్కారు. 

మొదట బండ్ల గణేష్ భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపై మీడియా "కాస్త నవ్వండి సార్!.. ఎలా ఉన్నారు?" అని పలకరిస్తే, "ఏం నవ్వుతాం ..నవ్వే పరిస్థితా మాది.. ఒక ఓటమి విజయానికి పునాది... అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.. అందర్నీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకుంటున్నా.. నేను అజ్ఞాతంలో ఉన్నా అంటు న్నారు. కాని నేను అజ్ఞాతంలో లేను. నేను గెలుస్తుందనుకున్న మా పార్టీ ఓడిపోయింది కాబట్టి రెండు మూడు రోజులు బాధతో బయటకు రాలేదు. మనం ఎన్నో ఊహించుకుంటాం!.. కాకపోతే ప్రజలు తిరస్కరించారు. కాబట్టి మౌనంగా ఉన్నాం! ప్రజలు మాపక్షాన లేకపోవడం బాధకలిగించింది. అయితే వారి నిర్ణయాన్ని కాదనలేం" అని తేలికగా స్పందించారు. 

"పీక కోసుకుంటా అన్నారుగా!.. గణేష్ గారూ!" అన్న పాత్రికేయుని ప్రశ్నకు కోపంలో వంద అంటాం.. రాజకీయాల్లో చాలా మంది చాలా అంటారు! అవన్నీ అవుతాయా? గెలవలేదు కరక్టే! పార్టీకి కాన్ఫిడెన్స్ ఇద్దాం! అని అన్న మాటకు ఇప్పుడు ఏం చేయమంటారు? పీక కోసుకుంటా అన్నా అది నిజమే - ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది. ఏం చేస్తాం!.. దేవుడి సన్నిధానంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడకూడదు మిగతావి తరువాత మాట్లాడతా" అని అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు బండ్ల గణేష్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: