జగన్.. ఇలాంటి నేతలను నమ్ముకుంటే... మళ్లీ కష్టాలే..?

Chakravarthi Kalyan

రాజకీయాల్లో విమర్శలు సహజం. అందులోనూ ప్రతిపక్షం అన్నా మరింత బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వం తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపాలి.. ప్రశ్నించాలి. అది ప్రతిపక్షం హక్కు. కానీ కొందరు ఆ హక్కును దుర్వినియోగం చేస్తారు. అధికారపక్షంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. దీనివల్ల ప్రతిపక్షం విశ్వసనీయత పోతుంది.


ఇప్పుడు జగన్ పార్టీలో విజయసాయిరెడ్డి తీరు అలాగే ఉంది. తుపానుపై ఏపీ సర్కారు ఉదాసీనతపై ఆయన విమర్శిస్తూ చంద్రబాబును పర్సనల్ గా టార్గెట్ చేశారు. చంద్రబాబుకు కారు డాష్ బోర్డుకు, కంప్యూటర్ డేష్ బోర్డుకు తేడా తెలియదని సెటైర్లు వేశారు. చంద్రబాబు చెప్పేవాటికి ,చేసేవాటికి సంబంధం ఉండదన్నారు. అంతా ప్రచారం తప్ప డేష్ బోర్డులో ఏమి ఉంటుందో తెలియదని విజయసాయి అంటున్నారు.



చంద్రబాబుకు ప్రచారయావ ఎక్కువే ఉండొచ్చు.. ఆ విషయం అందిరకీ తెలిసిందే. ప్రతిపక్షంగా దాన్ని నిలదీయాల్సిందే. కానీ ఆ నిలదీయడంలో లాజిక్ ఉండాలి కదా.. సర్కారు సాయం చేసేకంటే ప్రచారం ఎక్కువ చేసుకుంటోందని విమర్శించొచ్చు. కానీ అసలు చంద్రబాబుకు కారు డ్యాష్ బోర్డ్కు, కంప్యూటర్ డ్యాష్ బోర్డుకు తేడా తెలియదని మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా..



ఇలాంటి విమర్శల వల్ల.. అసలు సమస్యలు వచ్చినప్పుడు విమర్సించినా జనం కూడా పెద్దగా పట్టించుకోరు. అంతే కాదు.. ఈవీఎంల విషయంలోనూ విజయసాయి అలాగే మాట్లాడారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ట్యాంపరింగ్ ద్వారానే వైఎస్సార్‌పీసీ కంటే 5 లక్షల ఓట్లు ఎక్కువ రాబట్టుకుని అధికారంలోకి వచ్చారన్నారు. ఇలాంటి డొల్ల వాదనలు చేసే నేతలలను నమ్ముకుంటే.. 2019లో జగన్ కు మరోసారి నిరాశ తప్పదేమో..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: