సెంటిమెంటుతో చెలగాటం - చంద్రబాబుకు ప్రాణ సంకటం

ప్రజల నమ్మకం విశ్వాసం తో చెలగాటం నిప్పుతో ఆటలాడటం రెండూ ఒకటే. రెండూ తుదవరకు కాల్చెసేవే. తెలుగు దేశం ఎందుకు పుట్టింది? అని ప్రశ్నిస్తే సమాధానం కాంగ్రెస్ అనే నిరంకుశ పాలననను ధిక్కరించటానికని, తెలుగువారి ఆత్మ గౌరవం నిలుపుకోవటానికి మాత్రమే నని చెప్పని తెలుగువారుండరు. నాలుగు దశాబ్ధాలుగా ప్రజల నరనరాల్లో ఇంకిపోయిన ఆ భావన ఇప్పుడు ఆ రెండింటి పొత్తును సహించరు కాక సహించరు.   
 
ప్రపంచంలో ఏమైనా జరగవచ్చు కాంగ్రెస్ పార్టీ – తెలుగు దేశం రెండూ చేతులు కలిపితే తెలుగు ప్రజ హర్షించదు. ఈ విషయం రాజకీయ విశ్లేషకులు తొలి నుంచి చెబుతూ వస్తూనే ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయ వైరం కుల మతాల కన్నా బలమైనది. శత్రు వర్గాలుగా, రాజకీయ పాము ముంగిసలుగా చలామణి అయిన ఈ రెండు పార్టీ లూ చేతులు కలిపితే, హర్షించగల చప్పట్లు కొట్టగల జనాలు ఇప్పుడు కాదు ఎప్పటికి ఉండరు. "ఆత్మాభిమానం" అమ్మేయటానికి తెలుగు ప్రజలు సిద్ధంగా లేరనే విషయాని కి విశ్లేషణలు బహు రకాలు. జాతి వైరంలాగా కాంగ్రెస్-టీడీపీ అనేది శత్రుత్వానికి మారుపేరులా వెలుగొందింది. 


కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలహీనమైపోయినా, కాంగ్రెస్ ఊపు ఊసూ లేకపోయినా, ఈ రెండింటి మధ్యన వైరం మాత్రం జన హృదయాల్లో నిద్రాణంగా కొన సాగుతూ వస్తుంది. అది సెంటిమెంట్ దానికి తిరుగులేదు. అలాంటి నిప్పును ప్రక్కనుంచుకొని నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో మైత్రి కోసం చేతులు కలిపాడు. తెలంగాణ తెలుగు శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి పేరుతో పోటీ చేశాడు. ఫలితంగా ఆయనతో కలిపి అయనతొ కలిసిన నాలుగు పార్టీల చరిత్ర దహనమై పోయింది. ఎవరికైనా వైఫల్యం చెందితే అయ్యో పాపం! ఓడిపోయారు! అనే సానుభూతి దొరుకుతుంది. ఇక్కడ ప్రజలకు సానుభూతి లేకపోగా దరిద్రం వదిలిందంటున్నారు. 

ఈ అపవిత్ర పొత్తును తెలంగాణ ప్రజలు నిర్దద్వంగా తిరస్కరించారు. మహాకూటమిని చిత్తుగా ఓడించారు. ఎడం కాలితో తంతే బంగాళా ఖాతం తీరానికి పడిపోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు సంపాదించుకున్న ఓట్లు యథాతథంగా వీరి కూటమికి పడి ఉంటే టీఆరెస్ ఓటమి నల్లేరుపై నడక అయి వుండేది. అయితే ఈ విరుద్ద
స్వభావాల బద్ధవైరం అవకాశవాది చంద్రబాబు, అసమర్ధ రాహుల్ గాంధి వదులుకున్నా క్షేత్ర స్థాయిలో జనాలు అంగీకరించలేదు. కారణం వారు అవకాశవాదులు కాదు కాబట్టి. వారిది సెంటిమెంట్ ఓటెసే వారికి, వారి ఆదర్శ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు మనోఫలకంపై మెదులుతాడు. అందుకే వీరి అక్రమ కూడికైన ప్రజా కూటమి చిత్తు అయ్యింది.

మరి తెలంగాణలో అలా ఈ కూటమి చిత్తుఅయినా, ఆం.ప్ర. లో మాత్రం మళ్లీ పొత్తుకు సిద్ధం అయిపోతోంది తెలుగుదేశంపార్టీ. పొత్తులేని పార్టీని నడపటంచంద్రబాబుకు చేతగాదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏపిలో హీనదశలో ఉంది. పదిహేను శాసనసభ సీట్లు మూడు లోక్సభ సీట్లు ముస్టేత్తే వీళ్ల పొత్తు కుదరబోతుందట, అలాంటి హీన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మినహా చంద్రబాబుకు మరో అవకాశం లేకుండా పోయింది.

మరి ఈ అపవిత్ర కలయికను తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. ఆ ప్రయోగం వికటించినా దాన్నే ఏపీలో మళ్లీ చేయబూనటం చంద్రబాబు రాజకీయ మతిభ్రమణాన్ని సూచిస్తుందంటున్నారు అటు ప్రజలు ఇటు విశ్లేషకులు. ఇంకేం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏక పక్షపోటీ జరిగేది,  టీడీపీ చిత్తు అయ్యేది గ్యారంటీ అని టిడిపి కొంప ముంచటానికి  ఈ పొత్తు సెంటిమెంటొకటి చాలదా! అని విశ్లేషకుల భావన. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: