"చెవిటి వాళ్లకు సమాధానం వినిపించదు" - అరుణ్ జైట్లీ వ్యాఖ్య

కేంద్ర ఆర్దికమంత్రి అరుణ్ జైట్లి రఫేల్ డీల్ పై రాహుల్ గాంధి చేసిన వ్యాఖ్యలు వాటిపై ఆయన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. రఫెల్ డీల్ పై సుప్రింకోర్టు తీర్పు వచ్చిన అనంతరం ఆయన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.


నిజానికి ఒక ముఖమే కాని అబద్దానికి బహు ముఖాలు అని అన్నారు. అబద్ధం జీవితకాలం చాలా కొంచెం. కేసు విషయంలో దాని పరిమితి కొన్ని నెలలు మాత్రమే.


అబద్ధం, దాని  సృష్టికర్త  విశ్వసనీయత ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది  అన్న ఆర్యోక్తిని ఉదహరించారు.  రఫేల్‌-డీల్ విషయంలో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు అన్నీ నిజమని తేలాయి.


రాహుల్‌ గాంధి ఈ విషయంలో సృష్టించినవీ, చెప్పినవన్నీ అబద్ధాలు అని స్పష్టమైంది అని ఆయన వ్యాఖ్యానించారు. రఫేల్‌-డీల్ పై ఆరోపణలు చేసిన వాళ్లందరూ అని విధాలుగా ఓడి పోయారని ఆయన విమర్శించారు.


జెపిసి వేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై ఆయన మాట్లాడుతూ చెవిటి వాళ్లకు ఎప్పుటికీ మన సమాధానం వినిపించదు అని ఎద్దేవ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: