"టైగర్ జిందా హై! భయపడకండి"- మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన సీఎ పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు ఒటమికి బాధ్యత తనదేననటంతో ఆయనపై విశ్వాసం గ్రాఫ్ అమాంతం నింగినంటింది. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనంతరం ఆ మాత్రం యాంటీ-ఇంకంబెన్సీ సహజం అంటారు భోపాల్ వాసులు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌  ఉపన్యాసం జొష్ చూసి మధ్యప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికల సమరం మొదలైందా? అనే అనుమానం వచ్చిందంటున్నారు విశ్లేషకులు. 


ఆధునిక మధ్యప్రదేశ్‌ నిర్మాత ప్రజలకు ధైర్యం చెప్పడానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ మంచి వక్త. తన పదునైన విమర్శనాస్త్రాలతో ప్రత్యర్ధులను చీల్చి చెండాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన నియోజకవర్గమైన బుద్నీ ప్రాంతంలో పర్యటించిన చౌహాన్‌ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ, "ఎవ్వరూ భయపడకండి. ఎవ్వరికీ ఏమీ కాదు. నేనున్నాను. టైగర్‌ అభి జిందా హై - పులి ఇప్పటికి కూడా బతికే ఉంది  అన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.



ఎన్నికల్లో ఓడిపోయినందుకు పూర్తిబాధ్యత తనదేనంటూ శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పాలన గురించి మాట్లాడుతూ చౌహాన్‌ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా అంతే చమత్కారంగా మాట్లాడి జనాల్లో జోష్ నింపారు చౌహాన్. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం బుధ్ని పర్యటనకు వెళ్లారు. 


ఈ సందర్భంగా ప్రజలను ఉద్ధేశిస్తూ  ఎవరు భయపడకండి. మీకు ఏం కాదు. నేను ఇక్కడే ఉన్నాను. పులి ఇంకా బతికే ఉందంటూ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై సినిమాలోని డైలాగులు చెప్పడంతో జనం ఆశ్చర్యపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేదు సరికదా! ఒక ధీమంతుని నైజం కనిపించింది.

తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పటానికి మరో విధంగా మీకు నేనున్నాను నేను ఉన్నాను ధైర్యం కోల్పోవద్దు పులినై మీకు తోడుంటా! అనే అభయం ఆ మాటల్లో తొణికిసలాడింది.  ఆయన తనను తాను పులిగా చిత్రీకరించుకున్నారు.


ఎన్నికల ప్రచారం సందర్భంగా పాత హిందీ సినిమా పాట పాడుతూ రాహుల్ గాంధీని విదేశీయుడంటూ, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుద్నీ ప్రాంతంలో ప్రచారం చేస్తూ, తుమ్‌ తో టెహ్రే పర్‌ దేశీ  అంటూ అలనాటి హిందీ పాటతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై ఛలోక్తులు విసరడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. చౌహాన్‌ ఇలాంటి సినిమా డైలాగులతో, పాటలతో,  ప్రసంగాలతో ప్రజల్లో జోష్ నింపటం కొత్త విషయమేమీ కాదంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: