సంక్రాంతికి 'శాశ్వత రాజధాని అమరావతి' లో 'తాత్కాలిక హైకోర్ట్' సిద్ధం!!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం శరవేగంగా జీ+2 మోడల్ లో భవన నిర్మాణం దాదాపు సిద్ధమవుతోంది.  భవనానికి వెలుపల ‘శాండ్‌స్టోన్‌ క్లాడింగ్‌’ నిర్మాణంతో పాటు ఇంటీరియర్ డెకరేషన్ కూడా సాగుతోంది. హైకోర్టు భవనాన్ని సంక్రాంతి అంతే జనవరి 15 నాటికి సర్వహంగులతో, సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తామని 'సీఆర్‌డీఏ' అధికారులుపేర్కొన్నారు. 

ఇది, తాత్కాలిక భవనమే అయినా, పూర్తిస్థాయిలో ఒక హైకోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని సౌకర్యాలూ సమకూరుస్తున్నారు. భవనానికి రెండు వైపులా పార్కులు, విశాల మైన పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటుచేస్తున్నారు. ఆధునిక సాంకేతికత, హంగులతో కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా ఈ భవనం నిర్మిస్తున్నారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో జీ+2 గా నిర్మిస్తోన్న ఈ భవంతిని భవిష్యత్తులో జీ+5 కి విస్తరించుకునేందుకు వీలుగా రూపొందించారు. రాజస్థాన్‌ శాండ్‌స్టోన్‌ తో తాపడం చేసి అత్యంత అందంగా తీర్చిదిద్దు తున్నారు.

*జీ+5 మోడల్ లో న్యాయవాదుల చాంబర్‌ నిర్మిస్తున్నారు.
*మొత్తం 150 మంది సీనియర్‌ లాయర్లకు సరిపడే విధంగా ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
*హైకోర్టు భవనంలో కారిడార్లలో తప్ప మిగతా అన్ని చోట్లా ఏసీ సదుపాయం ఉంటుంది. 
*దస్త్రాల్ని భద్రపరిచేందుకు ఆధునిక వసతులో స్టోరేజీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 

*450 కార్లు కు వీలుగా పార్కింగ్ స్థలం కోసం మూడెకరాలు కేటాయించారు. భవనంలో ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌
*22 కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు.
*న్యాయమూర్తులు, ప్రజలు, న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది కోసం వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. 
*ఈ భవనంలోనే 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ‘మహిళా న్యాయవాదుల సంఘం’ కోసం ప్రత్యేకంగా విశాలమైన హాల్ ఏర్పాటు చేయనున్నారు.  

*500మంది ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా గార్డెన్‌ లో క్యాంటీన్‌ భవనం నిర్మిస్తారు.
*సీనియర్‌ లాయర్ల కు ఛాంబర్ల కోసం 55వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మిస్తారు.



ఏమైనా అంతా తాత్కాలికమే అంటున్నారు. బహుశ రాజధాని తాత్కాలికం కాకుంటేచాలని అంటున్నారు అమరావతివాసులు తాత్కాలికానికింత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటే శాశ్వతాలు ఎలా ఉంటాయో? అంటున్నారు కూడా! తాత్కాలిక భవన సముదాయాల నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విలసిల్లుతుంది. నాడు తాత్కాలిక సచివాలయం నేడు తాత్కాలిక హైకోర్ట్ భవనం అంతా తాత్కాలికమే అనటం ఖర్చు మాత్రం తడిసిమోపెడై ఏపి ప్రజలపై ఈ దుబారా భారం అంతా ఇంతా కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: