బ్రేకింగ్ న్యూస్ : జగన్ హత్యాయత్నం కేసు ఎన్ఐఏకి బదిలీ

Vijaya

ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నం కేసులో హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ హత్యాయత్నం కేసును కేంద్రప్రభుత్వ పరిధిలోని ఎన్ఐఏకి బదిలీ చేయాలని హై కోర్టు నిర్ణయం తీసుకుంది. హత్యాయత్నం కేసు విచారణను ఎన్ఐఏ తో చేయించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించటం గమనార్హం. అదే విధంగా తన నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికి కూడా తెలిసింది. కేసు తదుపరి విచారణను మళ్ళీ జనవరి 4వ తేదీకి విచారణ వేసింది.

 

 అక్టోబర్ 23వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగినప్పటి నుండి చాలా మలుపులు తిరిగింది. విమానాశ్రయంలో జరిగిన దాడి హత్యాయత్నమే అంటూ జగన్ అండ్ కో వాదిస్తోంది. కాదు జగనే కావాలని తనపై తానే దాడి చేయించుకున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో ఎదురుదాడి చేస్తున్నారు. సరే దాడి విషయంలో ఎవరి వాదనలు ఎలాగున్నా తర్వాత జరిగిన పరిణామాలే చంద్రబాబుపై అనుమానాలను పెంచేసింది.


జగన్ పై జరిగిన దాడిని ఉత్తుత్తి దాడిగా నిరూపించేందుకు ప్రభుత్వం లేకపోతే అధికార తెలుగుదేశం నానా అవస్తలు పడింది. జగన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం, టిడిపి చేసిన ప్రతీ ప్రయత్నం బెడిసికొట్టింది. అదే సమయంలో తనపై జరిగింది హత్యాయత్నమే అంటూ జగన్ చేసిన వాదనకు బలం చేకూరింది. దాంతో ప్రభుత్వం వేసిన సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని జగన్ థర్డ్ పార్టీ విచారణ కోరుతూ హై కోర్టులో పిటీషన్ వేశారు. ఆ కేసు విచారణ విషయంలోనే కోర్టు కేంద్ర, రాష్ట్రాలకు ఎన్ఐఏ విచారణపై ఆదేశాలు జారీ చేసింది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: