మహాకూటమి ఒక మాయ కాంగ్రెస్ టిడిపిలపై విరుచుకు పడ్డ ప్రధాని నరేంద్ర మోడీ

కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఏర్పాటు అవుతున్న మహాకూటమి ఒక అపవిత్ర రాజకీయ కూటమి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా మహాకూటమిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "కొందరు నేతలు మహాకూటమి గురించి మాట్లాడుతున్నారు. ఈ మహాకూటమి కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే. ఇది ఒక సిద్ధాంతం కోసమో ప్రజా శ్రేయస్సును ఉద్దేసించి ఏర్పాటవుతున్న కూటమి మాత్రం కాదు. అధికారం స్వలాభాపేక్ష కోసమే మహాకూటమిని ఏర్పాటు చేస్తు న్నారు. ప్రజల కోసం కాదు. కాంగ్రెస్‌ ప్రజల్లో అసత్యాలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తోంది. ఒక వైపు దేశాభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతుంటే, మరోవైపు ప్రజలను తప్పుదోవ పట్టించే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఏ అవకాశాన్నీ వదలడం లేదు" అని విమర్శించారు.
 
తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నరేంద్ర మోదీ ఆదివారం మాట్లాడారు. ఈ సందర్భంగా మహాకూటమి ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నా లపై విరుచుకు వ్పడ్డారు. రాజవంశీకులు, సంపన్నులు, దశాబ్ధాలుగా దేశాన్ని వదలకుండా పాలించి స్కాములతో, చతికిలబడి, మళ్ళీ అధికారంలోకి రావాలను కుంటున్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేసించి ఒక సంఘంగా ఏర్పడ్డారని, వీరి కూటమి ఒక గందరగోళ కూటమి అని ఎద్దేవా చేశారు.

అయితే కాంగ్రెస్ తో తెలుగు ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్ టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి పోరాడారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేం దుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలపై నరేంద్ర మోదీ తీవ్రంగా విరుచుకు పడ్డారు. తెలుగు దేశం పార్టీ మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీని కాంగ్రెస్ దుర్మార్గాలకు, దాష్టీకాలకు వ్యతిరేకంగా స్వర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. 

తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పోరాడారని కాంగ్రెస్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ఏర్పాటైన టీడీపీ నేడు అదే కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంటోందని దుయ్య బట్టారు. వ్యక్తిగత మనుగడ కోసమే ప్రతిపక్షపార్టీల కూటమి ఏర్పడుతోందని నరేంద్ర మోదీ ఆరోపించారు. అధికారం కోసమే ఈ మహాకూటమి అని, ప్రజలకోసం కాదని అన్నారు.
తమ ప్రభుత్వం దేశంలో చాలా అభివృద్ధి పనులను చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


పట్టణీకరణ అనేది నేను ఒక సవాలుగా భావించడం లేదు. మాకు లభించిన  అవకాశంగా భావిస్తున్నాను. మా ప్రయత్నాలు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి అలాగే, ఈ ఏడాది ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. న్యూ ఇండియా నిర్మాణంలో భాగంగా ఈ ఏడాది చాలా కార్యక్రమాలను ప్రారంభించాం. కార్యకర్తలందరూ మన మాతృభూమి గొప్పదనం పట్ల గౌరవాన్ని నింపు కొని, ప్రజలతో మమేకం కావాలి. పేద ప్రజల వైపున నిలబడాలి. రానున్న ఎన్నికల్లో మన పార్టీ విజయం మరింత సులువు అవుతుంది  అని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: