పొత్తులో కాలెట్టి అడుగేసిన వేళ తెలంగాణాలో.... “కాంగ్రెస్ ఫినిష్”


ఏం పాదం రా బాబూ!  నాలుగు దశాబ్ధాల నుండి పొత్తులతో పాలన నడుపుతూ ఒక్కో ప్రణాళికా కాలంలో ఒక్కో పార్టీని ముంచేసి తాను మాత్రం బలపడుతూ సహజ న్యాయానికి పాడెగట్టేయటం ఆయనగారికి అలవాటు. పొత్తుల్లో సహజ న్యాయమంటే ఇరుపక్షాలు ఒకే...ఒకే... గా ఉండటం అన్నమాట. కలసి ఉంటే కలదు సుఖం అన్నట్లు, ఇరుపక్షా లకూ రాజకీయ పొత్తులలో శ్రేయోదాయకం అవటం సహజ న్యాయం. కాని ఈ బాబుతో పొత్తు అంటే బాబు,  బాగు పడటం కోసం మరొకరు నిండా మునగటం అన్నమాట.

ప్రస్తుత ప్రణాళికా కాలంలో మునిగింది భారతీయ జనతా పార్టీ అన్నమాట. గతంలో  ఈయన పార్టీతో పొత్తెట్టుకొని కలిక్కానిక్కూడా లేకుండా పోయిన పార్టీలెన్నో చెప్ప నలవి కాదు. మొత్తం మీద ఇక మిగిలిన కాంగ్రెస్ ఆయనతో పొత్తులో కాలెట్టటం నిప్పులో కాలెట్టటమేనని ఋజువైంది తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడైతే కాంగ్రెస్ తో చేతులు కలిపాడో, అక్కడ ఆ పార్టీ చిత్తు అయ్యింది. 


ఒకవైపు ఉత్తరాదిన బీజేపీని ఎదుర్కొని కాంగ్రెస్ విజయం సాధించింది. కథ అయిపోయిందని అనుకున్న చోట అధికారాన్ని అందుకుంది. అయితే తెలంగాణలో ఘన విజయం అనుకున్న చోట మాత్రం కాంగ్రెస్ పార్టీకి  ధారుణమైన దెబ్బ పడింది. దీని కంతా బాబు గారి పాద మహిమ అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అదీ ఘంటాపథంగా.  
కాంగ్రెస్, తెలంగాణా జన సమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలసిన ప్రజా కూటమిలో టిడిపి పాదం మోపింది.  ఏం పాదం రా బాబూ! పాదం పెట్టి పదం కదిపిన వేళ “కాంగ్రెస్ ఫినిష్” అయిపోయింది కదా!  అసలు ఆ పార్టీలు విడి విడిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు నిజంగా కేసీఆర్ తీర్ధయాత్రలకే పోయుండేవారు. కాంగ్రెస్ 16వ తారీఖున ఎమెల్యెల చేత ప్రమాణ స్వీకారం చేయించి మంత్రిమండలి ఏర్పడి ఉండేది.  

అదంతా చంద్రబాబు ప్రవేశ మహిమే అని చెప్పనక్కర్లేదు. ఒకవేళ తెలంగాణలో చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపక పోయుంటే కనీసం ఆ పార్టీ పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది అని మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఇలా తెలంగాణలో తెలుగుదేశంతో స్నేహమే కాంగ్రెస్ ను ముంచిందని అనని రాజకీయవేత్త విశ్లేషకుడు లేరు. బీఎస్పీకి ఒక ఎంపీ సీటును అదనంగా ఇచ్చింది సమాజ్ వాదీ పార్టీ.  అలాగే ఆర్ఎల్డీని కూడా కలుపుకుని మూడు ఎంపీ సీట్లు ఇచ్చారు. ఎస్పీ ముప్పై ఏడు సీట్లతో సంతృప్తి పడింది.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ కు మరో దెబ్బ పడింది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చాయి “సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు” ఆ రెండు పార్టీలూ ఇప్పుడు సీట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.  కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం పట్టించు కోకుండా ఆ రెండు పార్టీలూ సీట్లను పంచేసుకోవడం విశేషం. నిన్న రిపబ్లిక్ టివి - ఏబిపి – సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం ఈ పొత్తు బిజెపి ప్రన సంకటమే! 

ఎనభై ఎంపీసీట్లను అలా పంచుకున్న ఆ పార్టీలు కేవలం రెండు ఎంపీ సీట్లను కాంగ్రెస్ కు వదిలాయి.  కాంగ్రెస్ కు ఇష్టమైతే ఆ సీట్లలో పోటీ చేయవచ్చని ప్రకటించాయి
అంతకు మించి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వమని ఆ పార్టీలు తెగేసి చెప్పాయి. కాంగ్రెస్ పార్టీకి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఎంతో కీలకంగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు యూపీ లో కాంగ్రెస్ కు ఉన్నది రెండు సీట్లు. ఆ రెండు సీట్లూ మాత్రమే పొత్తులో ఉంటే ఇస్తామని అక్కడి పార్టీలు అంటున్నాయి. అయితే కాంగ్రెస్ పదిసీట్లు కావాలని అంటోంది. ఆ పార్టీలేమో ఇచ్చేలా లేవు. అదీ కాంగ్రెస్ స్టామినా!


ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో కూడా కాంగ్రెస్ కు దెబ్బ పడింది. రాహుల్ గాంధిని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించాడు డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్. అయితే ఈ విషయంలో తృణమూల్ కాంగ్రెస్ తో సహా కాంగ్రెస్ మిత్రపక్షాలు అన్నీ పలు అభ్యంతరాలు చెప్పాయి ఒక్క టిడిపి తప్ప. మొత్తానికి బాబు వెళ్లి కాంగ్రెస్ ను కలిశాడు. కాంగ్రెస్ కు అనుకూల పక్షాలు దూరం అవుతున్నాయి!


దేశ రాజకీయాలను దున్నేస్తాం, మోదీని గద్దె దించేస్తాం, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ టీడీపీ సత్తా చాటుతాం అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణలో ఉన్నఆ కాస్తా పరువూ పోతోంది.  మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ కుటుంబీకులు వారి ఆడపడుచు సుహాసినినే గెలిపించుకో లేక పోయిన చంద్రబాబు ఇప్పుడు మరో షాక్ తినబోతున్నారు. గత 2014 ఎన్నికల్లో 15మంది గెలిచి అంతా ఫిరాయించినా కూడా ఎటూ వెళ్లకుండా పార్టీనే అంటిపెట్టుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈసారి మాత్రం చంద్రబాబును వదిలేయడానికి సిద్ధ మయ్యారట. దానికి కారణాలేవైనా, ఏ ఉపయోగమూ లేని కంచి గరుడసేవ ఎంతకాలం చేస్తారు ఎవరైనా! మొన్నటి ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. అయితే ఈసారి ఆయన కారెక్కబోతున్నారట. అంతే కాదు ఆయనకు టీఆర్ఎస్ నుంచి మంత్రి పదవి హామీ కూడా దక్కిందని చెబుతున్నారు.

సత్తుపల్లి సండ్రతో పాటు ఖమ్మం జిల్లా నుంచే అశ్వాపురం మచ్చా నాగేశ్వరరావు కూడా టీడీపీ నుంచి గెలిచారు. మొత్తం తెలంగాణలో ఈ ఇద్దరే టీడీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు సండ్ర చేరిక ఖాయం కాగా ఆయనతో పాటు మరో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది.  కానీ, ఆయన చంద్రబాబును కలిసి తాను టీడీపీలోనే ఉంటానని ప్రస్తుతానికి చెప్పారు. అంతే కాదు సండ్ర మంత్రి పదవి కోసం తనను కూడా టీఆరెస్‌ లోకి తీసుకెళ్లాలను కుంటున్నారని అనుచరుల వద్ద అంటున్నట్లు సమాచారం. 


ఇప్పటి వరకు అయితే ఆయన్నుటీఆర్ఎస్ నేతలెవరూ సంప్రదించలేదట. ఫ్రతిపక్షం లేని  ప్రభుత్వ స్థాపనలో కేసీఆర్ సార్వభౌముడు, కాబట్టి మచ్చ టిఆరెస్ లో చేరిక కొద్దిగా ఆలశ్యంగా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే తెలంగాణా లో చంద్రబాబు పొత్తుల సార్వభౌముడు ఫినిష్ అవనున్నారా!
 

టిడిపి తో పొత్తులేని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘనవిజయం 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: