జనసేన షాకింగ్ డెసిషన్ !!

Satya
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ పార్టీలు తమ విధానాలను ప్రకటిస్తున్నాయి. కేవలం మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో గెలుపు దారులను వెతుక్కోవడంతో పాటు వ్యూహాలను కూడా ఖరారు చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నాయి. ఏపీ విషయానికి వస్తే టీడీపీ, వైసీపీలతో పాటు, జనసేన కూడా ఎన్నికల సన్నాహాలు మొదలెట్టేసింది.


ఒంటరి పోరుట :


వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీకి దిగుతుందని ఆ పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ చెబుతున్నారు. తమ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు అభ్యర్ధులను నిలబెడుతుందని ఆయన వెల్లడించారు. అన్ని స్థానాల్లో అభ్యర్థులను  ఎంపిక చెసి షెడ్యూల్ ప్రకారం ప్రకటిస్తామని చెప్పారు. జన తరంగం పేరుతో ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేస్తామన్నారు. త్వరలో పార్టీ కార్యచరణ ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.


ఎర్రన్నలకు ఝలక్ :


ఇదిలా ఉండగా జనసేనతో పొత్తులంటూ చాన్నాళ్ళుగా చెప్పుకుంటున్న వామపక్షాలకు ఈ ప్రకటన షాక్ లాంటిదేనని చెప్పాలి. నాదేండ్ల మనోహర్ చెప్పారంటే అది పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నదే బయటకు వచ్చిందని అంటున్నారు. అంతకు ముందు అమెరికా టూర్లో పవన్ కూడా తాము ఎవరితో పొత్తులు పెట్టుకోవడం లేదని చెప్పుకొచ్చారు. మొత్తానికి నాదెండ్ల ప్రకటన  కనుక ఫైనల్ అయితే మాత్రం ఏపీలో బహుముఖ పోటీలు తప్పకపోవచ్చునని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: