మీ ఫోన్లో ఆ ఫోటోలుంటే జైలుకు వెళ్లక తప్పదు..?

Chakravarthi Kalyan
పైకి మర్యాద రామన్నల్లా కనిపిస్తున్నా.. అవకాశం చిక్కితే చాలామంది రసిక రాజులవుతుంటారు. ఇప్పుడు ఇంటర్‌నెట్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక బూతు బొమ్మలు, వీడియోలు చూడటం సర్వ సాధారణమైపోయింది. సాక్షాత్తూ అసెంబ్లీల్లోనే ఎమ్మెల్యేలు పోర్న్ వీడియోలు చూస్తే కెమేరాలకూ గతంలో చిక్కారు.


ఐతే.. మొబైళ్లలోనూ, కంప్యూటర్లలోనూ 18లోపు పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాలు ఉంటే మాత్రం మీరు జైలుకు వెళ్లక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లలపై లైంగిక నేరాలను నిరోధించేందుకు తెచ్చిన పోక్సో చట్టానికి కేంద్రం మరింతగా పదునుపెడుతోంది. కీలక సవరణలు చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.



ఈ సవరణల ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడితే ఏకంగా మరణ శిక్ష కూడా విధించవచ్చు. 18 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించిన నీలి చిత్రాలు కలిగిఉంటే.. భారీ జరిమానా విధిస్తారు. అలాంటి నీలిచిత్రాలను వ్యాపింప జేస్తే జైలుశిక్ష, జరిమానా ఉంటాయి. అంతేకాదు.. చైల్డ్ పోర్న్‌కు సంబంధించిన సమాచారం ఉండి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా కూడా నేరంగానే పరిగణనిస్తారు



కొత్త సవరణల ప్రకారం సినిమాల్లోనూ, ఇతర ప్రసార మాధ్యమాల్లోనూ చైల్డ్ పోర్న్‌ ను చూపించినా,ప్రేరేపించినా నేరమే. ఇంకా చైల్డ్‌ పోర్న్ వీడియోలతో వాణిజ్యం చేస్తే అది ఇంకా పెద్ద నేరంగా పరిగణిస్తారు. అలాగే పిల్లల కృత్రిమ ఎదుగుదలకు కారణమయ్యే హార్మోన్‌ ఇంజక్షన్ల వాడకమూ నేరంగానే భావిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: