అక్టోబర్-నవంబర్లోనే నిర్మాణం పూర్తౌతుందన్న హైకోర్ట్ భవనాన్ని కాకులు ఎత్తుకెళ్ళాయా?

"నవంబర్ 19 తారీఖు నాడే హైదరాబాద్ హైకోర్ట్ నిర్మాణం పూర్తయినట్లు, దాన్ని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి వీక్షించి అభినందించినట్లు - ప్రచారమైన వీడియో ఒకటి ఈ ఆర్టికిల్ కు అనుసందించాం-మీరూ చూడండి! అవసరమైతే ఆనాటి నుండే హైకోర్ట్ పనిచేయవచ్చని సిఆర్డిఏ అధికారులు అన్న విషయం అందులో ప్రస్థావించినట్లు ఉంది. మరిప్పుడు ఆనాటి హైకోర్ట్ భవనాలను కాకులు ఎత్తుకెళ్ళాయా? ఎమిటీ డ్రామాలని ప్రజలంటున్నారు 

https://www.youtube.com/watch?v=Vc72YoG6v20


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విభజనకు నోటీఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి లోని ప్రజావేదిక వద్ద ఇంధనం, మౌలిక వసతులపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన అనంతరం,  మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టును విభజించాల్సిందిగా ముందు తామే కేంద్రానికి లేఖ రాశామన్నారు. 

అయితే అమరావతిలో హైకోర్టు భవనానికి స్థలం కేటాయించామని, విభజన ప్రక్రియ ప్రారంభిస్తే నిర్మాణం చేపడతామని తాను కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కనీసం 30 రోజుల సమయం ఇస్తారని, కానీ కేంద్రం కనీస సంప్రదాయాలను పాటించలేదని మండిపడ్డారు. హైకోర్టు విభజన, ఆనాటి ఆంధ్రప్రదేశ్ విభజనను గుర్తు చేస్తోందని 5 రోజుల్లో ఉద్యోగులు, న్యాయవాదులు ఉన్న పళంగా హైదరాబాద్‌ను వీడలేరని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రం పట్ల కేంద్రం ప్రవర్తించవలసిన తీరు ఇది కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయితే ఈ విభజనపై ముఖ్యమంత్రి కేంద్రంపై చేసిన ఘాటు వ్యాఖ్యలపై ధీటుగా స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. హైకోర్టు అంటే దేశంలో గౌరవం, హోదా ఉన్నటువంటి వ్యవస్థని దానిని తన కాంపు ఆఫీస్ లో పెట్టుకొని ఒక ప్రభుత్వ ఆఫీసుగా మార్చుకోవాలని అనుకుంటున్నారని జీవీఎల్ ఆరోపించారు. తాత్కాలిక హైకోర్టు భవంతిని 12నెలల సమయంలో కట్టలేక పోవడం రాహ్ట్ర ప్రభుత్వ చేత కాని తనం కాదా! అని జీవీఎల్ ప్రశ్నించారు.


హైదరాబాద్‌ను సైబరాబాద్ ను తానే కట్టానని, ప్రపంచ స్థాయి నగరం గా అమరావతిని నిర్మిస్తున్నానని చెప్పిన ముఖ్యమంత్రి రెండంతస్తుల భవనాన్ని ఒక ఏడాదిలో కట్ట లేక పోవడమేమిటి?  అంటూ దుయ్యబట్టారు. హైకోర్టును విభజించాలని, డిసెంబర్ 15 నాటికి అమరావతిలో తాత్కాలిక భవనాలు సిద్ధమవుతాయని సీఎం నాడే చెప్పారని, మళ్లీ ఇప్పుడు తన చేతగాని తనాన్ని వేరే వాళ్ల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా చంద్రబాబు ఆరోపణలు ఉన్నాయని జీవీఎల్ ఎద్దేవా చేశారు. జనవరి 1 న ఏపీలో కొత్త హైకోర్టును ఏర్పాటు చేయాలని అక్టోబర్‌ లోనే సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని జీవీఎల్ గుర్తు చేశారు.

ముఖ్య మంత్రి సుప్రీంకోర్టును అగౌరవ పరచిందని, దీనివల్ల హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవీఎల్ వెల్లడించారు.అమరావతి లో కొత్తగా నిర్మిస్తున్న హైకోర్టు భవనంవద్ద వసతులు సరిగాలేవని, విభజన కార్యక్రమాన్ని కొద్ది రోజులపాటు నిలిపివేయాలని స్వయంగా "ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్"  ఒక తీర్మానం చేసిందన్నారు. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.


హైకోర్టు విభజనకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్ చుట్టూ ముఖ్యమంత్రి ప్రదక్షిణలు చేశారని, అలాగే రాష్ట్రానికి చెంది న అధికారులు కూడా న్యాయశాఖ చుట్టూ తిరిగారని ఆయన ఎద్దేవా చేశారు. భవనాలు సిద్ధంగా లేకపోతే కొద్దికాలం వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి వుండవచ్చు కదా! అని నరసింహారావు ఎద్దేవా చేశారు. హైకోర్టు ఏపీ లోనే ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆయన అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: