ఏది హడావిడి చంద్రబాబూ? నిప్పులు చెరిగిన కేసీఆర్..

Chakravarthi Kalyan
హైకోర్టు విభజనను కేంద్రం హడావిడిగా చేసిందంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు విభజనను కూడా చంద్రబాబు రాజకీయం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు గతంలోనే తీర్చు ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు.


ప్రస్తుతం కేంద్రం కేవలం సుప్రీంకోర్టు తీర్పును యథాతథంగా అమలుపరుస్తోందని.. ఇది హడావిడి ఎలా అవుతుందని కేసీఆర్ నిలదీశారు. హైకోర్టు విభజనకు తాము సిద్ధమే అని గతంలోనే ఏపీ సర్కారు సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా చెప్పడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.



చంద్రబాబు దేశంలోనే డర్టీయస్ట్ పొలిటీషియన్ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు మాటలకు కొన్ని పత్రికలు బాకాలు ఊదుతూ సహకరిస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు.



జనవరి 1 నుంచి హైకోర్టు విభజన ఉంటుందని ముందే తెలిసినా భవనాలు సిద్ధం చేయని చంద్రబాబు ఇన్నాళ్లూ ఎక్కడ పడుకున్నాడని మండిపడ్డారు కేసీఆర్. చంద్రబాబు నోరు తెలిస్తే అబద్దాలు చెబుతుంటారని.. ఈ ముఖ్యమంత్రిని భరిస్తున్నఏపీ ప్రజలను అభినందించాలని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: