దేశంలో రోజు రోజుకీ మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు పెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వంలు ఇలాంటి నేరస్థుల పట్ల ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అవి కఠినంగా ఉండకపోవడంతో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ దారుణాలు జరుగుతున్నాయి. భారత దేశంలో ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజధాని ఢిల్లీ లో ఇలాంటి దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఈ ఇలాంటి అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మహిళలు కనిపిస్తే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా ఓ మహిళ తనకు వార్నింగ్ ఇచ్చిందన్న కక్ష్యతో ఓ యువకుడు మహిళను నగ్నంగా పరిగెత్తించాడు. ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడిచేసి, వివస్త్రను చేసి నడి బజార్లో పరుగులు పెట్టించాడు. ఉత్తరప్రదేశ్లోని భడోహి జిల్లా గోపీగంజ్లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..శనివారం సాయంత్రం ఓ మహిళ బజారు నుంచి ఇంటికి వస్తుండగా ఓ యువకుడు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి వెకి చేష్టలకు ఆ మహిళ ధైర్యంగా వార్నింగ్ ఇచ్చింది. దీంతో అవమానభారంతో అక్కడి నుంచి వెనుదిరిగిన యువకుడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
ఈ విషయాన్ని తన స్నేహితులతో చెప్పి అదును చూసి ఆమె ఇంటికి వెళ్లి బయటకు లాక్కొచ్చి దాడి చేశాడు. వివస్త్రను చేసి వీధుల్లో పరుగులు పెట్టించాడు. ఆ మహిళ భయంతో రోడ్డు పై పరుగులు తీస్తుంటే రక్షించాల్సిన యువకులు ఫోటోలు, వీడియోలు తీస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు.