కేసీఆర్‌తో మళ్లీ కెలుక్కుంటున్న బాబు.? కేసీఆర్ కుమ్మేస్తాడా..?

Chakravarthi Kalyan

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. గెలిచిన ప్రతివాడూ శాశ్వత విజేత కాడు.. ఓడిన ప్రతివాడూ నిత్య పరాజితుడు కాదు.. కానీ దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు ఈ సూత్రం మరిచినట్టున్నారు. తెలంగాణలో మహా కూటమి ఓటమిని ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.



తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో కేసీఆర్ గెలుపుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ చేయకుండానే ఎనభై సీట్లు గెలిచారని చంద్రబాబు కామెంట్ చేయడం ఆయన అసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఏమీ చేయని కేసీఆర్ ఎనభై సీట్లు గెలిస్తే, అన్నీ చేసిన తెలుగుదేశం ఏపీలో అంతకంటే ఎక్కువ గెలవాలని ఆయన అంటున్నారు.



ఏపీలో టీడీపీ గెలిస్తే తన అసమర్ధత బయటపడుతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని చంద్రబాబు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి చేయి కాల్చుకున్న చంద్రబాబు మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్టుగా ఆలోచిస్తే మహాకూటమి ఓటమి ద్వారా చంద్రబాబు ఇప్పటికే తన అసమర్థత బయటపెట్టుకున్నట్టే చెప్పుకోవాలి.


ఇప్పటికే హైకోర్టు విభజన, ప్రత్యేక హోదాపై కేసీఆర్ పై పదే పదే చేసిన వ్యాఖ్యలకు గులాబీ నేత ఘాటుగానే డోస్ ఇచ్చారు. చంద్రబాబు డర్టీయస్ట్ పొలిటీషియన్ అని కడిగిపారేశారు. అయినా చంద్రబాబు పదే పదే కేసీఆర్ ప్రస్తావన తెస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే మరోసారి కేసీఆర్ ఇంకాస్త గట్టి డోస్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: