బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబు పై సవాల్ విసిరిన ఉండవల్లి..!

KSK
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో 2014 నుండి ప్రస్తుతం వరకు ఏం జరిగిందో అన్న దాన్ని విషయంపై శ్వేత పత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు విడుదల చేసిన శ్వేతా పత్రాలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.


అసలు రాష్ట్రంలో జరిగిన దానికి శ్వేతపత్రంలో ఉన్న దానికి చాలా వ్యత్యాసం ఉందని చాలా విషయాలు తెలుగుదేశం ప్రభుత్వం మరుగు చేసిందని అది కూడా బయటకు రావాలని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి. ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం పనుల విషయంలో జరిగిన అవకతవకలు గురించి కూడా బయట పెట్టాలని కోరారు. అంతేకాకుండా శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్‌ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు.


తెలంగాణాలో చంద్ర‌బాబు అతి ప్ర‌చారమే కూట‌మి కొంప ముంచింద‌న్నారు. బాబు ప్ర‌చారానికి పోకుంటే ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేద‌న్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే… ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. ఇదే క్రమంలో వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర గురించి పొగడ్తల వర్షం కురిపించారు.


భవిష్యత్తులో తండ్రికి మించిన తనయుడు జగన్ అవుతాడని జగన్ లో మంచి మాటకారి ఉన్నారని అది వైయస్సార్ లో కూడా లేదని జగన్ స్పీచ్ లకు జనం నుండి మంచి స్పందన వస్తుందని నేరుగా పబ్లిక్ లోనే జగన్ అలా ఇంటరాక్ట్ అవ్వడం అతని పొలిటికల్ కెరియర్ కి ప్లస్ అవుతుందని జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు ఉండవల్లి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: