జగన్, బాబు.. వీరిలో కాబోయే సీఎం ఎవరో.. దీన్ని బట్టే చెప్పేయొచ్చు..?!

Chakravarthi Kalyan

ఏపీలో పాలిటిక్స్ గరం గరంగా మారుతున్నాయి. 2014లో కొద్దిలో సీఎం పీఠం తప్పిపోయిందని బాధపడుతున్న జగన్ ఈ సారి ఎలాగైనా సీఎం కావాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. మరోవైపు రెండోసారి గెలిచి సీఎం పీఠాన్ని నిలబెట్టుకోవాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.



కానీ జగన్, చంద్రబాబు ఇద్దరినీ పోలిస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ జగన్‌లోనే కనిపిస్తోంది. చంద్రబాబు గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఆయనలో సడలుతోందని ఆయన మాటలే చెబుతున్నాయి.



వచ్చే ఎన్నికల్లో సింగిల్‌ గానే పోటీలో దిగేందుకు వైసీపీ రెడీ అయ్యింది. గత ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోలేదు. కానీ చంద్రబాబులో మాత్రం పొత్తు లేకుండా సొంతంగా ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం కనిపించడం లేదు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ సాయం కోరడం గమనిస్తే.. చంద్రబాబు మరి ఇలా బేలగా మారిపోయారేంటా అనిపించకమానదు.



కుప్పంలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కూడా తనకు సహకరించాలని కోరారు. మరి లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టానని చెప్పుకునే చంద్రబాబు.. ప్రజలు తనను గెలిపించరని ఎందుకు అనుకుంటున్నారో.. ఎవరి సాయమూ లేకుండా ఒంటరిగా ఎన్నికలు ఎందుకు వెళ్లలేకపోతున్నారో..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: